పల్లెటూరి నుంచి వచ్చిన ఓ కుర్రాడు దేశంలోనే సివిల్స్ లో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. ఇందులో పెద్ద విశేషం ఏమీ లేకపోవచ్చు.. కానీ ఆ కుర్రాడు నిరుపేద.. ఇంగ్లీష్ మీడియం చదువుల్లేవు.. ఆర్ సీ రెడ్డి, నారాయణ వంటి కోచింగులు లేవు.. సివిల్స్ ఎంచుకున్నది తెలుగు మీడియంలో .. ఇంటర్వ్యూ కూడా తెలుగులో ట్రాన్స్ లేటర్ ను పెట్టించుకుని చేయించుకున్నాడు.

Image result for indian administrative service logo with indian flag

ఐనా.. అసలు ప్రతిభంటూ ఉంటూ అడ్డుగోడలు ఏముంటాయి.. అందుకే అకుంఠిత దీక్షతో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల పల్లె నుంచి దేశ రాజధానిని జయించాడు. దేశ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి శెహభాస్ అనిపించుకున్నాడు. తనలాంటి ఎందరో గ్రామీణ నేపథ్యం కలవారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆత్మవిశ్వసం ఉంటే చాలు సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు. 

Image result for indian administrative service logo with indian flag

శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి గోపాలకృష్ణ తల్లిదండ్రులు అప్పారావు, రుక్మిణి ఇద్దరు వ్యవసాయ కూలీలే. వీరి కష్టాన్ని చూసి జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్లాలని చిన్నతనంలోనే నిశ్చయించుకున్నాడు గోపాలకృష్ణ. మొదట ఉపాధ్యాయుడిగా ప్రభుత్వోద్యోగం సాధించి దాన్నే సివిల్స్ కు మెట్టుగా ఉపయోగించుకున్నాడు. పలాసలోని రేగులపాడు ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే సొంతంగా సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు. 

Image result for ias logo

సివిల్స్ సాధనలో గోపాల కృష్ణ మూడుసార్లు విఫలమయ్యాడు. అయినా పట్టువదలకుండా నాలుగో ప్రయత్నంలో విజయం సాధించారు. తెలుగులో సివిల్స్‌రాసి విజయం సాధించి చూపారు. తెలుగులోనే మెయిన్స్‌ రాసి, ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే పూర్తి చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: