సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం..కొన్ని చరిత్రల్లో వింటూ ఉంటాం.. పురాతన కాలంలో మహరాజులు తమ వద్ద ఉన్న విలువైన ధనం, వ్రజ వైఢూర్యాలు శత్రువులకు చిక్కకుండా కొన్ని రహస్య ప్రదేశాల్లో దాచే వారని...అయితే వాటి వివరాలు చిత్ర రూపంలో కానీ, వింతైన లిపి రూపంలో చెక్కించే వారు..లేదా నక్షలు వేయించే వారు. ఇప్పటి వరకు భారత దేశంలో ఇలాంటి నిధి నిక్షేపాలు ఎన్నో బయట పడ్డాయి..కొన్నింటి వివరాలు తెలిసినా..కొన్నింటి వివరాలు మాత్రం ఇప్పటికీ గోప్యంగా ఉన్నాయి.
తాజాగా బిహార్ రాష్ట్రంలోని రాజ్ గిరి నగరంలోని సోన్ బండార్ గుహలో ఉన్న నిధి గురించి ఇప్పటికీ రహస్యమే అని అంటుంన్నారు. ఈ గుహలో విలువైన నిధీ నిక్షేపాల గురించి అక్కడి శాసనాలు తెలియజేస్తున్నాయి. ఈ సంపద దక్కించుకోవాలని అలనాటి రాజుల నుంచి బ్రిటీష పాలకుల వరకు అంతెందుకు ఇప్పటికీ విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
వందల యేళ్ల నుంచి ప్రపంచ శాస్త్రవేత్తలు ఈ నిధిపై అధ్యాయనం చేస్తున్నారు...కానీ ఫలితం మాత్రం శూన్యంగానే ఉంది. అంతు చిక్కని రహస్య నిధి ఈ గుహలోకి ఎలా వచ్చిందో ఒక్కసారి తెలుసుకుందా..! బింబసారుడికి వయసు పై పడటంతో..మగద సింహాసనం కోసం అతని కుమారుల మద్య పెద్ద యుద్దమే కొనసాగింది.
అయితే అందరికన్నా బలవంతుడైన అజాత శత్రువు తన తండ్రి బింబిసారుడిని సోన్ బండార్ గుహలో బంధించి మగధ సింహాసనాన్ని అధిష్టించాడు. అయితే తన తనయుడు అజాతశత్రువు ఇలాంటి దుర్మార్గానికి పాల్పపడతాడని ముందే ఊహించిన బింబిసారుడు తన అమూల్య ధనం, వ్రజ వైఢూర్యాలు విలువైన సంపద మొత్తం ఈ గుహలో దాచి ఉంచాడట. ఈ విషయం తెలుసుకున్న అజాత శత్రువు ఆ గుహలోకి వెళ్లే మార్గం చెప్పమని వారిని ఎన్నో కష్టాలు పెడతాడు..కానీ బింభిసారుడు మాత్రం చెప్పకుండా చనిపోతాడు.
దీంతో అజాత శత్రువు మానసికంగా క్రుంగిపోయి పిచ్చివాడు అవుతాడు. ఆ సమయంలో మగధకు కొంత మంది బౌద్ధ బిక్షువులు వచ్చి అజాత శత్రువు పిచ్చి తగ్గిస్తారు. తర్వాత ఆయన బౌద్ద మతం స్వీకరించిన తర్వాత ఆ ధనం గురించి పూర్తిగా మర్చిపోతాడు. కాకపోతే బింబిసారుడు మాత్రం తాను మరణించే ముందు ఆ నిధి రహస్యం అర్థం కానీ ఓ లిపిలో చెక్కించి వెళ్లినట్లు అక్కడి శాసనాలు చెబుతున్నాయి.
ఈ నిధి దక్కించుకోవడాని ఆ కాలం నుంచి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక బ్రిటీష్ కాలంలో ఫిరంగులతో ఆ గుహను పెకిలించాలని ప్రయత్నాలు కూడా కొనసాగలేదు. ఏది ఏమైనా ఇలాంటి నిధుల ఆన్వేషన భారత దేశంలో ఇంకా కొనసాగుతున్నాయంటే ఆశ్చర్యం లేదు.