"భార దేశ రాజకీయాల్లో ఇదే అసలు స్య, వ్యక్తిగ స్వార్థం కోసం ఏదైనా చేసే వెసులుబాటు ఉంది. ఎలాంటి నియమాలూ, విలువలూ, విశ్వనీయతా అనేవి లేకుండా పోతున్నాయి" …..... రాహుల్ గాంధి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు


 Related image

ఇప్పుడు భార‌త‌దేశ రాజ‌కీయాల్లో అతిపెద్ద స‌మ‌స్య, ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కంటే, వ్య‌క్తిగ‌త రాజ‌కీయ స్వార్థ ప్ర‌యోజ‌నాల‌కే నాయ‌కులు ప్రాధాన్య‌త ఇస్తుండ‌టం! బీహార్ లో జ‌రిగింది ఇదే. ఆర్జేడీతో బంధం తెంచుకుని, 24 గంట‌లు గ‌డ‌వక ముందే నితీష్ కుమార్ మ‌రోసారి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం స్వీకారం చేసేశారు. ఈ ప‌రిణామాల‌పై ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ పై విధంగా స్పందించారు.


 అంతేకాదు బీహార్ ప్ర‌జ‌ల‌ను నితీష్ కుమార్ నిలువునా మోసం చేశార‌ని విమ‌ర్శించారు. మ‌తత‌త్వశ‌క్తుల‌కు వ్య‌తిరేకంగా ప‌రిపాల‌న చేస్తార‌న్న న‌మ్మ‌కంతో నితీష్ కు ప్ర‌జ‌లు గెలిపిస్తే, త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కోసం ఇవాళ్ల నితీష్ అలాంటి వారితోనే చేతులు క‌లుపుతున్నారు అన్నారు. నితీష్ ప్లానింగ్ అంతా గ‌డ‌చిన నాలుగైదు నెల‌లుగా తెలుస్తూనే ఉంద‌నీ, ఇప్పుడు స‌మ‌యం చూసుకుని గోడ దూకేశార‌న్నారు.

 

"భార‌త దేశ రాజ‌కీయాల్లో ఇదే అస‌లు స‌మ‌స్య, వ్య‌క్తిగ‌త స్వార్థం కోసం ఏదైనా చేసే వెసులుబాటు ఉంది. ఎలాంటి నియ‌మాలూ, విలువ‌లూ, విశ్వ‌స‌నీయ‌తా అనేవి లేకుండా పోతున్నాయి" అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఐతే,  రాహుల్ గాంధి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గా మాట్లాడిన మాటల్లో  తొలిసారిగా పరిపక్వత ద్వనించింది. లివి. కాని వ్యక్తిగత స్వార్ధం, విశ్వసనీయతా లోపం  వారి కాంగ్రెస్ పార్టీనే గత 132 యేళ్ళుగా భారత దేశం లోని రాజకీయపార్టీలకు ప్రజలకు నూరి పోసింది. ఆ యదార్ధం మాత్రం తెలియని అపరిపక్వత ఆయనది.


 అయితే ఇక్కడ కాంగ్రెస్ ను వేలెత్తిచూపటం అనే ఆలోచనేలేదు. ఎవరైనా నాయకుడు జాతిని ప్రగతిపథంలో నడిపించాలనే వారు తామెమిచెప్పారో అదేచెయ్యాలి. ఏదిచేశారో అదే చెప్పాలి. ఈ రెండూ కాకుండా ఏమి చేసినా అంటే ఇతరులను తప్పు పట్టటం తనవరకొస్తే వేరే తీరుగా మాట్లాడటం ధర్మం కాదు. అందుకే రాహుల్ గాంధి ఎంత గొప్పగా మాట్లాడినా ఏమాత్రమూ దేశానికి ఉపయోగపడి మేలు చేయగలడనుకోలేము. ఐదు దశాబ్ధాల పాలన వారేమిటో తెలిపింది. జాతి ఆయన్ని ఆయన పార్టీ ని మరచిపోయి మూడేళ్ళు అవుతుంది.


 Image result for images of modi


ఇప్పుడు నరెంద్రమోడీ పాలనవచ్చింది. ప్రజలు గౌరవంగా ఆయనకు "నమో"నమామి అంటున్నారు. విదేశాల్లో, స్వదేశములో, చివరికి మన్ కీ బాత్ లో మాట్లాడినా ఆయన పట్ల సుహృద్భావంతో ఆయన అందించగల అద్భుత అవినీతి, పక్షపాతం, బందు ప్రీతి, ప్రాంత, మత, కుల, లింగ వివక్ష రహిత పాలన కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన ప్రణాళికను బట్టి ఆయన్ని ఆయన పార్టీని రెండింట మూడింతల ఆధిఖ్యత యిచ్చి మరీ అధికారపీఠం పై కూర్చో బెట్టారు. ఇక్కడ ప్రజల తప్పు లేదు. కావలసిం దంతా చేసి మాకు సుపరిపాలన యిమ్మన్నారు.

 

భారత రాజకీయ చిత్రాన్ని చూడండి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిసా, పస్చిమ బంగా, మేఘాలయ, మిజోరాం, అరుణాచల ప్రదేశ్, పంజాబ్ తప్ప దేశమంటా బాజపా దాని మిత్రపక్షాల (ఎన్.డి.ఏ) పాలనలోకి వచ్చేసింది. కాంగ్రెస్ తప్ప యుపిఏ అధికారం పూర్తిగా తుడిచి పెట్టుకు పోయింది. పార్లమెంట్ ఎన్నికల పరంగా ఎన్.డి.ఏ మిత్రపక్షాలకు కొంత మాత్రమే చోటిచ్చి బాజపా కే అగ్ర పీఠం కట్టపెట్టారు. ఒక వేళ మిత్రపక్షాలు "ఝలక్" ఇచ్చినా బాజపాకు పాలనా పరంగా ఆధిక్యత పరంగా ఐదేళ్ళు భయం లేని సురక్షతను భారత ప్రజ అందించింది. ప్రజలు నరెంద్ర మోడీ అంటే బాజపా బాజపా అంటే నరెంద్ర మోడీ గా చూస్తారు తప్ప వేరే ఆలోచన ఉండదు.  

 

2013లో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగిన వెంటనే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం నరెంద్ర మోడిని ప్రధాన మంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకు అనుకూల పవనాలు బలంగా వీచాయి. మొదట్లో నరెంద్ర మోడి రాజకీయ గురువు లాల్ కృష్ణ అద్వాని, అడ్డుతగిలిననూ వెంటనే ఆయన కూడా నరెంద్ర మోడి అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ నరెంద్ర మోడి ప్రభావంతో గణనీయమైన స్థానాలు సాధించింది. నరెంద్ర  మోడి స్వయంగా వడోడర నుంచి 5 లక్షలకుపైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా వారణాసిలో కూడా భారీ మెజారిటోతో గెలుపొందినారు.


 Image result for india political map with states ruling parties

Sixteen states are currently being ruled by the  BJP  (NDA)


నరేంద్ర మోడికి నలుగులు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఝానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. వెంట ఎప్పుడు లాప్‌టాప్ ఉంచు కుంటారు. ఖరీదైన దుస్తులు ధరిస్తారు. అనేక వ్యాసాలతో పాటు 3 పుస్తకాలను కూడా రచించారు. సొంత ఆస్థి  కూడబెట్టుకోలేదు. మంచి వక్త, వ్యూహకర్త అయిన మోడీ జీవితములో చాలా భాగం ఇప్పటికీ రహస్యమే. సాధారణం గా ముఖ్యమంత్రులు, మంత్రుల వంటి పదవులను అధిష్టించినవారి కుటుంబసభ్యులు ఏదో విధంగా లబ్ధి పొందుతుంటారు. రాజకీయాల్లోకి వస్తుంటారు. కానీ, మోడీ కుటుంబం ఇందుకు పూర్తి విరుద్ధం. ఆయన సోదరులు, సోదరీమణులు ఎవరి జీవితం వారిదే. తండ్రి దామోదర్‌దాస్ మరణించగా, తల్లి హీరాబెన్ మోడీ వద్దే ఉంటారు. నరేంద్ర మోడీ శాకాహారి.


ఇటు దేశ ప్రజలు అనితర సాధ్యమైన విజయమిస్తే, పార్టీ అధికారాన్ని ప్రశ్నించలేని పరిస్థితులను కలిపిస్తే, కుటుంబ సభ్యులు ఎవరూ నింద వేయలేని విధంగా బ్రతుకుతూ నరెంద్ర మోడీని ఎదురులేని నాయకుడు గా నిలబెట్టాయి. చివరకు  శత్రుగణం సర్వం కోల్పోయి నేలచూపులు చూస్తున్న తరుణమిది.


ఇక ఇంత కంటే ఎమి కావాలి ఒక దేశ ప్రధానికి. ఇంకో ముఖ్య విషయం తను వెలువరించని తన జీవిత రహస్యాలేమైనా ఉన్నా? ఆయన్ని ఏవరూ అంటే ధర్మపత్ని తో సహా ప్రశ్నించలేదు. ఇప్పుడు మోడీ యే చెప్పాలి ఇక విస్తృత రాజకీయ వ్యవహారంలో, సహకారం లో, తనకు లేని దేమిటో?  సార్వం సహా ఏ సార్వభౌమునికి లేని సాధికారత కట్టబెట్టిన భారత్ నేడు ఆయన్నుంచి ప్రజలు కోరేది కోరింది సుపరిపాలన, ఎన్నికల్లో వచించిన వాగ్ధానాలను అమలు చేయటం.


Image result for images of modi


"టెల్ అజ్ నమో జీ! వాట్ డూయూ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రం ది పీపుల్ ఆఫ్ ఇండియా? యువర్ పార్టీ? యువర్ ఫామిలి ఇంక్లూడింగ్ యువర్ బెటెర్-హాఫ్?"  .................................................................................  (ముగింపు రెండో భాగములో)

మరింత సమాచారం తెలుసుకోండి: