దేశభక్తులు, నిజమైన ప్రజా సేవకులు, మెధావులు, సమర్ధులు, ఋజువర్తన, క్రమశిక్షణ కలిగిన అధికారులు గాని కన్సల్టెంట్స్ గాని మన రాష్ట్రాలను శాసించే రాజకీయ పార్టీల అధినేతలను, ప్రభుత్వాల్లోని కొందరు ముఖ్యమంత్రుల నుండి మంత్రి మండలిలోని అనేకమంది మంత్రులను వారి నిర్ణయరాహిత్యాన్ని, అవినీతిని, అక్రమ లావాదేవీలను భరించలేరు, సహించ లేరు. శాసన సభలో శాసన నిర్మాణాలు చేసేది వీరే బయట అమలులో వాటికి అధికారులతో నయాన్నో, భయాన్నో, మభ్యపెట్టో, అదలించో ఏదో లాగా తూట్లు పొడిపించటం నిరంతరంగా జరుగుతూనే ఉంది.
ఈ సందర్భంగా ఒక విషయం ముచ్చటించాలి. ఒక ముఖ్యమంత్రి తీరుతో ప్రవర్తనతో విసిగిపోయిన ఘటనకు చెందిన సమాచారం బయటకొచ్చింది. "మెట్రో రైలు ప్రాజెక్టుల పితామహుడు శ్రీధరన్" ఆ ంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. కారణం ఆరు నెలలుగా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించటమేనట. అంతేకాక తన అనుయాయులైన కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం శ్రీధరన్ నేతృత్వం వహిస్తున్న డీఎంఆర్సీ (ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్) పై లేనిపోని అభాండాలు వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తుండడంతో ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత నెల 12వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన నేరుగా తన ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తూ లేఖను పంపారు.
దీనికి కూడా ముఖ్యమంత్రి నుండి స్పందనగాని సమాధానం గాని లేదు. అంతేకాకుండా ఎదుటి వాళ్ళకు మనసును కష్టపెట్టే సంఘట్టన ఏమంటే వెంటనే విజయవాడ "మెట్రో రైలు ప్రాజెక్టు" స్థానం లో "లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు" ను జర్మనీ ఆర్థిక సంస్థ "కేఎఫ్డబ్ల్యూ" కు ఇవ్వాలని నిర్ణయించారు. దీని వెనుక పెద్ద బాగోతమో గూడు పుఠాణీనో జరిగినట్లు సమాచారం. "మెట్రో రైలు ప్రాజెక్టు" పనులను అంచనాల కంటే చాలా ఎక్కువ రేటుకు "ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్" సంస్థలకు ఇవ్వాలని చంద్ర బాబు చేసిన సూచనను శ్రీధరన్ తిరస్కరించారు.
అప్పటి నుంచి ప్రభుత్వ అధినేతలు ఆ ప్రాజెక్ట్ నిర్వహించే పెద్దలు ఆయన్ను టార్గెట్ చేసుకుని ఒక వ్యూహం ప్రకారం ఆయనంతట ఆయనే రాజీనామా చేసే పరిస్థితి కల్పించారు. గత సంవత్సరం డిసెంబర్లో విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు లోని రూ.1700 కోట్ల విలువైన రెండు కారిడార్ల పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని డీఎంఆర్సీ ప్రతిపాదించింది.
దీని ముఖ్య ఉద్దేశం రూ.500 కోట్లకు మించిన పనుల్ని రెండు ప్యాకేజీలుగా విభజించటం వలన అనేక నైపుణ్యం ఉన్న కంపనీ లు, టెండర్ లో పాల్గొంటాయి. అంతకంటే ఎక్కువ మొత్తానికి ఒకే టెండర్ పిలవడం వల్ల ఆర్థిక స్థోమతలేని చిన్న సంస్థలు ఈ ప్రక్రియలో గొప్ప నైపుణ్యము ఉన్నా, టెండర్ లో ఎక్కువ సంస్థలు పోటీ పడే అవకాశం ఉండదు. ఒకటో రెండో పెద్ద కంపెనీ లు ఎక్కువ మొత్తానికి కోట్ చేసే పరిస్థితి ఉంటుందని ప్రభుత్వానికి డీఎంఆర్సీ నివేదించింది.
అయినా ప్రభుత్వం వినకుండా రెండు ప్యాకేజీ లుగానైనా విభజించి టెండర్లు పిలవాలని సూచించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రూ.800 కోట్లతో కారిడార్–1 కు, రూ.900 కోట్లతో కారిడార్–2 కు టెండర్లు పిలిచింది. దానికి ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్, సింప్లెక్స్ సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. సింప్లెక్స్ సంస్థ టెండరు దాఖలు చేశాక, తనకు ఆర్థిక స్థోమత సరిపోనందున తాను ఎంపిక కాకుండా డిస్క్వాలిఫై అవుతానని భావించి టెండరు నుండి తప్పుకుంటున్నట్లు లేఖ రాసి తప్పుకుంది.
ఈ నేపథ్యంలో కారిడార్–1 కి ఎల్ అండ్ టీ 45 శాతం, ఆఫ్కాన్స్ 55 శాతం, కారిడార్– 2 కు ఎల్ అండ్ టీ 45 శాతం, ఆఫ్కాన్స్ 35 శాతం టెండర్ కోట్ చేశాయి. దీనిప్రకారం కారిడార్–1 పనులు ఎల్ అండ్ టీకి, కారిడార్–2 పనులు ఆఫ్కాన్స్ కు దక్కుతాయి. అయితే ఇక్కడ అందరికీ అనుమానం వచ్చే సందర్భం "కారిడార్–2 లో 35 శాతం కోట్ చేసిన ఆఫ్కాన్స్, కారిడార్-1 లో 55 శాతం కోట్ చేయడం వెనకనున్న మతలబ్ ఏమిటి?" అనేది నిపుణుల ఆలోచన, అనుమానానికి ప్రభుత్వమే అవకాశం ఇచ్చింది. తెరచాటు బాగోతం ఎమైనా లాలూచీ ఏమైనా ఉందా అనేది పరిశీలకుల ప్రతిపక్షాల అనుమానం. ప్రధాన ప్రతిపక్ష మైతే దీని వెనుక లాలూచీ ఉందని స్పష్టంగా తెలుస్తోందని బల్లగుద్దిచెపుతుంది. రెండు సంస్థలు "రింగు" గా మారినట్లు గమనించిన "డీఎంఆర్సీ" దీనివల్ల ప్రాజెక్టుపై రూ.500 కోట్ల అదనపు భారం పడుతుందని సర్కారుకు నివేదించి టెండర్లు రద్దు చేసింది.
మళ్లీ ఇలా జరక్కుండా నాలుగు ప్యాకేజీలుగా పనుల్ని విభజించి మళ్లీ టెండర్లు పిలుస్తామని ప్రతిపాదించగా ప్రభుత్వ పెద్దలు స్పందించకుండా తాము చెప్పిన వారికి పనులు ఇవ్వలేదనే ఆగ్రహంతో సంప్రదింపులను సైతం నిలిపివేసింది. పరిస్థితిని వివరించడానికి శ్రీధరన్ ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరినా ముఖ్యమంత్రి ఇవ్వలేదు. పైగా విజయవాడ కు మెట్రో అనవసరమని, అంత ఖర్చుతో మెట్రో లైన్లు వేయడం కంటే ఫ్లైఓవర్లు కడితే సరిపోతుందని స్వయంగా చంద్రబాబు నెల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేశారు.
ఆ తర్వాత "ఏఎంఆర్సీ" (అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్), స్థానంలో ఎలివేటెడ్ కారిడార్ తీసుకొస్తామని ప్రకటించింది. మళ్ళీ మనసు మార్చుకుని కొద్దిరోజులకు అది సరిపోదని "లైట్ మెట్రో రైలు" కావాలని జర్మని, ఫ్రాంక్-ఫర్ట్ కు చెందిన కె.ఎఫ్.డబ్ల్యూ సంస్థ తో సంప్రదింపులు జరిపి ముఖ్యమంత్రి తో సమావేశం ఏర్పాటు చేయించింది. ఈ దశలో చివరిగా గత నెల 5 వ తేదీన శ్రీధరన్ ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ "లైట్ మెట్రో రైలు (ఎల్ఆర్టీ)" విజయవాడకు సరిపడదని. ఇప్పుడున్న స్థితిలో మెట్రో యే సరైనదని పేర్కొన్నారు. అయినా పట్టించుకోని ముఖ్యమంత్రి ఎల్ఆర్టీ కోసం కె.ఎఫ్.డబ్ల్యూ సంస్థతో సర్వే చేయిస్తుండడంతో మనస్తాపం చెందిన శ్రీధరన్ గత నెల 12వ తేదీన ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తూ లేఖ పంపారు.
అదే సమయంలో ఉత్తరప్రదేశ్ లోని లక్నో ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకుంటానని శ్రీధరన్ లేఖ రాస్తే, దానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ ఒప్పుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం శ్రీధరన్ ను తనకు నచ్చిన కంపెనీలకు టెండర్లు ఖరారు చేయలేదని తీవ్రంగా అవమానించినట్లే అర్ధమౌతుంది. మెట్రో రైల్ శ్రిధరన్ ను రాష్ట్రానికి పరిచయం చేసిన ముఖ్యమంత్రే ఇలా చేస్తే ప్రజలు ఇందులో గూడుపుఠాని ఉందనే అనుకుంటారు.
Central office of KfW (Westarkade Frankfurt)