కేంద్ర ప్రభుత్వం పాత నోట్లు రద్దు చేసి కొత్త నోట్లు ప్రవేశ బెట్టి సంవత్సరం అయ్యింది …అయితే కొత్తగా వచ్చిన 2000 నోట్లు , 500 నోట్ల విషయంలో విడుదల అయిన మొదటి రోజు నుంచి  2000 నోట్లు ఏ నిమిషాన అయినా రద్దు చేస్తారు అని ఊహాగానాలు వెలువడుతున్న విషయం తెలిసిందే.  అయితే ఇప్పటి వరకు అలాంటిది ఏమి లేదు అని ఎప్పటికప్పుడు కేంద్రం , ఆర్ బీ ఐ ప్రకటిస్తూ వచ్చినాయి. తాజాగా రూ.2వేల రూపాయాల నోట్లను ఆర్బీఐ మళ్లీ వెనక్కి తీసుకోనుంది.
Image result for 200 note
ఈ విషయాన్ని ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్టు వెల్లడించింది. అలాగే రూ.2వేల నోట్ల ముద్రణను కూడా ఆపేయాలని ఆర్బీఐ నిర్ణయించిందట. దీనికి సంబంధించి ఆర్బీఐ అధికారి ఇచ్చిన వార్షిక నివేదకను ఇటీవల లోక్‌సభ ముందు ఉంచారు. అందులో రిజర్వు బ్యాంక్ 3,654మిలియన్ల రూ.2వేల నోట్లను ముద్రించగా, వాటి మొత్తం విలువ రూ.15,787 మిలియన్లుగా తెలిపింది. అయితే డిసెంబర్ 8నాటికి రూ.13,324 బిలియన్ల పెద్ద నోట్లు మాత్రమే చలామణిలోకి వచ్చాయి. ఇంకా రూ.2,463 బిలియన్లు ఆర్బీఐ దగ్గరే ఉన్నాయి.
Related image
దీంతో రూ.2వేల నోట్ల ముద్రణను ఆపేసి, చిన్న నోట్ల ముద్రణకు ఆర్బీఐ మొగ్గుచూపుతోందని ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్ తెలిపారు. కొత్త 50 రూపాయల డినామినేషన్ మరియు 200 రూపాయల డినామినేషన్ లో నోట్లు విడుదల చేసింది కూడా అందుకే అని …పెద్ద డినామినేషన్ వల్ల నల్ల కుబేరులు తమ డబ్బుని దాచిపెట్టుకోవటం తేలిక అని ..అందుకే క్రమేపి పెద్ద డినామినేషన్ నోట్లని నిర్వీర్యం చేసి చిన్న డినామినేషన్ మార్కెట్లోకి విడుదల చేయాలని కేంద్రం ఆలోచనగా తెలుస్తుంది


మరింత సమాచారం తెలుసుకోండి: