"కంచే చేను మేసిన" సామెత తెలుసుకదా! తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ)కి దర్శకేంద్రుడని అభిమాన ప్రేక్షకుల చేత పిలవబడుతున్న కోవెలమూడి రాఘవేంద్రరావును అధ్యక్షుడుగా చేయడానికి నారా చంద్రబాబు నయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా అమరావతి అధికార వర్గాల నుంచి అనధికారంగా నైనా విశ్వసనీయంగా వస్తున్న సమాచారం.
దాదాపుగా ఒక సంవత్సరం పైగా, ఖాళీగా పడి ఉన్న "తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టు బోర్డు" అధ్యక్షుని నియామకం చేపట్టడానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యవధిలేదు సమయం చిక్కట్లేదు గానీ, ఎస్వీబీసీ లో చాన్నాళ్లుగా సాగుతున్న దోపిడీ పర్వాన్ని మరింత యథేచ్ఛగా, విచ్చలవిడిగా కొన సాగించడానికా అన్నట్లుగా, టాలీవుడ్ దర్శకుడు రాఘవేంద్రరావుకు ఆ చానెల్ చైర్మన్ పదవిని కట్టబెట్టడానికి చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలో ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయని విశ్వసనీయ సమాచారం.
కే. రాఘవేంద్రరావు గతంలో టీటీడీ బోర్డు సభ్యునిగా పనిచేశారు. ఎస్వీబీసీ ఛానెల్ కు సంబంధించి, ఆర్ధిక నిర్వాహణా వ్యవహారాలు గాడి తప్పడంలోనూ, కోట్లాది రూపాయ ల అవినీతి కుంభకోణాలు చోటు చేసుకోవడంలోనూ, ఆ ఛానెల్ సీఈవో నరసింహారావు కార్యకలాపాలకు - రాఘవేంద్రరావు మద్దతు ఉందని, ఆ కుంభకోణనికి ఈయన ప్రోద్బలం ఉందన్న ఆరోపణలు ఆ మధ్య కాలంలో చాలా బలంగా వినిపించాయి. అంతేకాదు ఇప్పటికీ వాటి ప్రతిధ్వని వినిపిస్తూనే ఉంది.
పాత టివి సీరియల్సుకు కొత్త పేర్లతో నామకరణం చేసి ఎస్వీబీసీకి అంటగట్టడం, ఛానెల్ ఖర్చుతో కోట్ల రూపాయల విలువైన సెట్లు వేయించి, తన నిర్మాణ సంస్థ తరఫున ఆ సీరియల్స్ ను రెఫర్బిష్ చేసి నూతనంగా కార్యక్రమాలను రూపొందించినట్లు చూపుతూ, వాటికి భారీ మొత్తాల్లో బిల్లులు వసూలు చేయడం జరిగింది. ఇదంతా ఆయన ఎస్వీబీసీ బోర్డు సభ్యుడిగా ఉండగానే, దానిని ప్రభావితం చేసి, భారీస్థాయిలో కుంభకోణాలకు నేఱాలకు అక్రమార్జనలకు దాన్ని అడ్డాగా మార్చి దోపిడీకి పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి.
అలాంటి కోవెలమూడి రాఘవేంద్రరావుకే, తాజాగా, సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ - అధ్యక్ష పదవిని బంగారు పళ్ళెంలో పెట్టి పాలన పగ్గాలు అప్పగించడం అంటే, దానిని దోచుకోవడానికి అన్మతి రెడ్ కార్పెట్ పరచి మరీ ఇచ్చినట్లే అని అభిఙ్జవర్గాల కథనం. ఈ వ్యవహారం చూస్తుంటే పచ్చని పంటను మేసేయమని కంచెకు చెప్పినట్లు, "దొంగ చేతికే తాళాలు" అప్పగించి ఆ ఖజానాకు కన్నం వేసేయమని ఆ నైపుణ్యం ఉన్నవాడికి, తాళాలు అప్పగిస్తే, ఇక దొంగకి కాపలా కాయడానికి సమయం ఎక్కడ ఉంటుంది దోచుకోవడానికి తప్ప.
దొంగచేతికే తాళాలు ఇవ్వడం అంటే, ఇక కన్నం వేయాల్సిన ప్రయాస లేకుండా, సమయా భావం కూడా తొలగించి యథేచ్ఛగా రాచ మార్గం లోనే ఖజానాను తరలించ మని చెప్పినట్లేనని అర్థం చేసుకోవటం అర్ధమవదా విఙ్జులైన జనావళికి? అవును మరి, ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం - నిర్ణయం లోని లోతుపాతుల గురించి పరిశీలిస్తే మనకే తెలుస్తుండగా లేనిది - భారత ప్రధాని నరెంద్ర మోడీ రాష్ట్రానికి నిధులెందుకు ఇవ్వలేక పోతున్నారో అర్ధమౌతుందనే ఉందని పలువురి భావన.