"టూ బిగ్ టూ ఫెయిల్" అనే గౌరవాన్ని పొందిన ప్రతిష్ఠాత్మక భారతీయ ప్రయివేట్ సెక్టర్ బాంక్, దిగ్గజం అనదగ్గ ఆ రంగ బ్యాంకు ఐసీఐసీఐ కు వరుసగా వివిధ వ్యవస్థల నుండి నియంత్రణ సంస్థల నుండి షాక్‌లపై షాకులు తగులుతూ బాంక్ కు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. భారతీయ ఎలక్ట్రానిక్స్ సంస్థ వీడియోకాన్ కు ఐసీఐసీఐ బాంక్ మంజూరు చేసిన రుణాలకు సంబంధించి కేసు నమోదు చేసి, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రాథమిక దర్యాప్తు (పిఈ) నేపథ్యంలో భారత మదుపు దార్ల సెంటి మెంట్ బలమైన దెబ్బపడింది.
దీని ప్రభావంతో ఐసీఐసీఐ బాంకు షేర్లలో అమ్మకాల వత్తిడి ఊపందుకుని, 5.6శాతం పతనాన్ని నమోదు చేసింది. ఈ దిగ్గజ బాంక్ ప్రత్యేకించి సెక్యూరిటీ విక్రయాల అంశంలో నియమనిభంధనలను పాటించని కారణంగా దేశీయ బాంకింగ్ నియంత్రణ సంస్థ మరియు కేంద్ర బాంక్ ఆర్బీఐ విధించిన ₹ 58.9 కోట్ల జరిమానా కూడా ఐసీఐసీఐసీ బ్యాంకు నెత్తిన పిడుగులా పడింది. ఈ వార్తలతో హోరెత్తిన మార్కెట్ మరోవైపు దివాళా బాటలో వీడియోకాన్ షేరు సైతం 5శాతం నష్టపోయి లోయర్ సర్క్యూట్ ను తాకడం గమనార్హం.
కాగా వీడియోకాన్ కు రుణాలు మంజూరు చేసిన అంశంలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్ పాత్రపై సీబీఐ విచారణ చేపట్టింది. ఇందులో క్విడ్ ప్రొక్వొ జాడలు ఏమైనా ఉన్నాయా? అని - వీడియోకాన్ గ్రూప్ కు వేల కోట్ల రుణాలిచ్చినందుకు గాను భారీ లబ్ది పొందారన్న ఆరోపణల నేపథ్యంలో చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూపు చైర్మన్ వేణుగోపాల్ ధూతపై సీబీఐ ప్రిలిమినరీ ఎంక్వైరీ(పీఈ) చేపట్టింది.
వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ రుణాలు విడుదల చేయడంలో "క్విడ్‌ప్రోకో" తరహా నేఱం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
![Image result for videocon head office](http://www.voicendata.com/wp-content/uploads/2016/09/Videocon-d2h.jpg)