డాన్ మున్నా బజరంగీ అలియాస్ ప్రేమ్ ప్రకాశ్ ఈ ఉదయం జైల్లోనే దారుణ హత్యకు గురయ్యాడు.  ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ ప్రేమ్‌ ప్రకాశ్‌ సింగ్‌ అలియాస్‌ మున్నా భజ్‌రంగీ సోమవారం ఉదయం భాగ్‌పత్‌ జైల్లో హత్యకు గురైనట్లు అధికారులు తెలిపారు.  బీఎస్పీ ఎమ్మెల్యే కేసులో నిందితుడైన ఆయనను ఉత్తరప్రదేశ్ ‌లోని భాగ్‌పట్‌ జైలులో కాల్చి చంపారు. సోమవారం ఉదయం 6:30 గంటల సమయంలో జైలులో ఆయన ప్రత్యర్థి సునీల్ రాఠీ పిస్టల్‌తో కాల్చి చంపినట్టు పోలీసులు తెలిపారు.

Gangster Munna Bajrangi had been in jail since his arrest from Mumbai in January 2009.

గత వారం అతని భార్య యుపి పోలీసుల హిట్‌ లిస్ట్‌లో తన భర్త ఉన్నాడని, అతని జీవితానికి ముప్పు ఉందని ఆరోపనలు చేసిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. ఝాన్సీ జైల్లో ఉన్న మున్నాను ఒక కేసులో భాగంగా సోమవారం ఉదయం భాగ్‌పత్‌ కోర్టులో హాజరు పరచాల్సిన నేపథ్యంలో ఆదివారం మున్నాను స్థానిక జైలుకు తీసుకొచ్చారు. సోమవారం ఉదయం జైలుకు తరలించే సమయంలో జైల్లోనే ఉన్న మరో గ్యాంగ్‌స్టర్‌ సునీల్‌ రాతి మున్నాపై తుపాకితో దాడి చేశాడు. 
 బీఎస్పీ ఎమ్మెల్యే హత్య కేసులో కోర్టులో ప్రవేశపెట్టేందుకు బజరంగీని గత రాత్రే ఝాన్సీ నుంచి భాగ్‌పట్ తీసుకొచ్చారు. ఉదయం అతడిని కాల్చి చంపడం కలకలం రేపుతోంది.
Image result for gangster munna kill in jail
ఈ నేపథ్యంలో  మరో గ్యాంగ్‌స్టర్‌ సునీల్‌ రాతి మున్నాపై తుపాకితో కాల్చాడు..తీవ్రంగా గాయపడ్డ అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే మరణించాడు. కాగా, జైళ్ల శాఖ ఎడిజి మాట్లాడుతూ జైలర్‌, డిప్యూటి జైలర్‌తో పాటు మరో ఇద్దరిని సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. జైలులోకి మారణాయుధాలు ఏ విధంగా వచ్చాయో తెలాల్సి ఉందన్నారు. కృష్ణానంద్‌ హత్య సమయంలో మున్నా, అతడి గ్యాంగ్ సభ్యులు ఆరు ఏకే 47 తుపాకులతో ఏకంగా 400 రౌండ్ల కాల్పులు జరిపారు. మున్నాపై పలు హత్య కేసులతోపాటు, బెదిరింపులు, కిడ్నాప్‌లకు పాల్పడిన కేసులు కూడా ఉన్నాయి. నేర చరిత్ర కలిగిన మున్నా 2012 యుపి అసెంబ్లీ ఎన్నికల్లో అప్నా దళ్‌ తరపున పోటీ చేసి ఓడిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: