రాజ‌ధాని ప్రాంత ఎంఎల్ఏ బోడె ప్ర‌సాద్ చిక్కుల్లో ప‌డ్డారు. అధికార‌పార్టీ ఎంఎల్ఏని క‌దా అని ఇష్టం వ‌చ్చిన‌ట్లు ప్ర‌త్య‌ర్ధుల‌పై నోరు పారేసుకుంటే కుద‌ర‌ద‌న్న విష‌యం ఎంఎల్ఏకి ఇపుడు అనుభ‌వంలోకి వ‌చ్చిన‌ట్లుంది. ఎంత అధికార పార్టీ ఎంఎల్ఏ అయినా కోర్టు ముందు త‌ల‌వొంచాల్సిందే అన్న విష‌యం ఇపుడు బోడె ప్ర‌సాద్ కు అర్ద‌మైంది.

Image result for tdp mla bode prasad

ఇంత‌కీ విష‌యం ఏమిటంటే, ఆమ‌ధ్య వైసిపి ఎంఎల్ఏ ఆర్కె రోజాకు, టిడిపి ఎంఎల్ఏ బోడె ప్రసాద్ కు మ‌ద్య మాట‌ల యుద్దం జ‌రిగింది లేండి. ఆ సంద‌ర్భంగా రోజాను బోడె నోటికొచ్చిన‌ట్లు తిట్టారు. అంతేకాకుండా వ్య‌క్త‌త్వాన్ని కించ‌ప‌రిచే విధంగా చాలా అస‌హ్యంగా కామెంట్లు చేశారు. అందుకు వైసిపి మ‌హిళా విభాగం ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌లు జ‌రిగినా టిడిపి ఎంఎల్ఏ లెక్క చేయ‌లేదు. రోజాకు బోడె క్ష‌మాపణ చెప్పాల‌ని చేసిన డిమాండ్ ను ప‌ట్టించుకోక‌పోతే మ‌రిత రెచ్చిపోయి కామెంట్లు చేశారు. 
దాంతో ఒళ్ళు మండిపోయిన రోజా వెంట‌నే పోలీసుస్టేష‌న్లో ఫిర్యాదు చేశారు ఎంఎల్ఏపై.
Image result for tdp mla bode prasad


అయితే, ఇక్క‌డ ఫిర్యాదు చేసింది ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసిపి ఎంఎల్ఏ రోజా. అందులోనూ అధికార టిడిపి ఎంఎల్ఏపైన‌. దాంతో పోలీసులు ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. టిడిపి ఎంఎల్ఏపై ఫిర్యాదు న‌మోదు చేయాలంటూ రోజా ఎంత ఒత్తిడి తెచ్చిన పోలీసులు ప‌ట్టించుకోలేదు. దాంతో రోజా కోర్టును ఆశ్ర‌యించారు. కేసు పూర్వ‌ప‌రాల‌ను ప‌రిశీలించిన కోర్టు బోడె ప్ర‌సాద్ పై త‌క్ష‌ణ‌మే కేసు న‌మోదు  చేయాలంటూ పోలీసుల‌పై సీరియ‌స్  అయ్యింది. దాంతో ఎంఎల్ఏపై కేసు న‌మోదు చేయ‌క పోలీసులకు త‌ప్ప‌టం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: