ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ తన వ్యాఖ్యలతో కాంట్రవర్సీలు సృష్టించే జేసీ దివాకర్ రెడ్డి తాజాగా ఎమ్మెల్యేలపై దారుణమైన మాటలు మాట్లాడి సంచలనం సృష్టించారు. అనంతపురంలో ని తాడిపత్రి గోల సర్ధమణగక ముందే ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఓ వైపు పోలీసులను బండ బూతులు తిట్టి సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన జేసీ ఇప్పుడు ఏమ్మెల్యేలపై నోరు జారడపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కర్నూలు జిల్లా అవుకులో ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ... సీఐ మాధవ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. సీఐ మాధవ్ చేసిన వ్యాఖ్యలు కేవలం తనకొక్కడికే కాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలందరికి వర్తిస్తాయని చెప్పారు.
ఆ సీఐ తనను ఒక్కడినే కాదు..ఏపిలో అందరు ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను అంటున్నాడని..వారు అందరూ ఇప్పటి వరకు స్పందించకపోవడం దురదృష్టమని..రోషం లేని వాళ్లంతా ఎమ్మెల్యేలు అయ్యారని వ్యాఖ్యానించారు. పోలీసుల ప్రవర్తనపై ఏ ఒక్కరూ స్పందించలేదని అన్నారు. ఇప్పుడు ఏపిలో ఎమ్మెల్యేలు..ఎంపీలు జేసీ మాటలకు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.