భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. చంద్రబాబునాయుడుకు ఐక్య రాజ్యసమితి నుండి ఆహ్వానం రావటం అంతా ఉత్త బూటకమే అంటూ జివిఎల్ కొట్టిపారేశారు. ఏపిలో జరుగుతోంది బూటకపు పాలనగా ఆయన వర్ణించారు. పాలనే ఉత్త బూటకం కాబట్టి అమెరికా ఐక్య రాజ్య సమితి సమావేశంలో పాల్గొనటం, ప్రసంగించటం కూడా బూటకమే అంటూ దుమ్ము దులిపేశారు.
చంద్రబాబు మొదటి నుండి చెప్పేదొకటి, చేసేదొకటిగా జివిఎల్ ఆరోపించారు. చంద్రబాబును ఐక్య రాజ్య సమితి నిజంగానే ఆహ్వానించి ఉంటే ఆ ఆహ్వాన పత్రికను ఎందుకు చూపించటం లేదంటూ నిలదీశారు. ఈ విషయంలో జివిఎల్ లాజిక్ కరెక్టుగానే ఉంది. అప్పట్లో కూడా ప్రపంచ ఆర్దిక సదస్సు నుండి ఆహ్వానం వచ్చినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. తీరా చూస్తే ఆ ఆహ్వానాన్ని వరల్డ్ ఎకనమిక్ ఫోరం పంపనే లేదు. నిర్వాహకుల నుండి చంద్రబాబే ప్రతీ ఏడాది కోట్ల రూపాయలకు కొనుక్కుని దావోస్ కు వెళుతూ పెద్ద బిల్డప్ ఇచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.
జివిఎల్ ఇపుడు చెబుతున్నది కూడా అదేమాట. న్యూయార్కులో జరుగుతున్నది ఐక్య రాజ్య సమితి సమావేశం కాదట. వరల్డ్ ఎకనమిక్ ఫోరమే అమెరికాలో రెండో సదస్సు నిర్వహిస్తోందట. ఆ సమావేశానికే చంద్రబాబు హాజరవుతున్నారని జివిఎల్ చెప్పారు. చైనాలో జరిగిన సదస్సుకు నారా లోకేష్ హాజరైన విషయం అందరికీ తెలిసిందే. అంటే జివిఎల్ చెబుతున్నది నిజమేనేమో ? ఒకవేళ జివిఎల్ చెప్పేది తప్పైతే వచ్చిన ఆహ్వాన పత్రాన్ని చూపిస్తే సరిపోతుంది కదా ?