ప్రపంచం ఎంత టెక్నాలజీతో ముందుకు సాగుతుందో..అంతే అనర్థాలు కూడా జరుగుతున్నాయి. టెక్నాలజీని మంచికి ఉపయోగిస్తే..భవిష్యత్ కి పూలబాట వేసిన వారు అవుతారు..కానీ ఈ మద్య ఎంతో మంది టెక్నాలజీని వినాశనానికే ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఫోర్న్ సినిమాల ప్రభావం విపరీతంగా పడుతుందన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఏక్కడో చాటు మాటున చూసుకునే ఫోర్న్ సినిమాలు..ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటున్నాయి..ముఖ్యంగా ఇంటర్ నెట్ సౌలభ్యం అతి తక్కువ ధరలోనే రావడంతో..ఎక్కువగా ఫోర్న్ చిత్రాలు వీక్షించడం జరుగుతుంది.
దీనివల్ల ఎన్నో వినాశనాలు జరుగుతున్నాయి..మైనర్లు సైతం ఈ ఫోర్న్ చూడటానికి అలవాటు పడటంతో యువతులు, మహిళలు చివరికి చిన్నారులపై అత్యాచారాలు పెచ్చుమీరుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పోర్న్ వెబ్ సైట్లపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రస్తుతం ఈ పోర్న్ వెబ్ సైట్లు లక్షల కొద్దీ ఉన్నాయి. ఇలాంటి ఫోర్న్ వెబ్ సైట్లు యువతను పెడద్రోవ పట్టిస్తున్నాయని..అందుకే వాటిని పూర్తిగా బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఈ పోర్న్ వెబ్ సైట్లు, అశ్లీల దృశ్యాలు...యువతను రెచ్చేగొట్టేలా ఉంటున్నాయని.. అందువల్లే దారుణాలు జరుగుతున్నాయని ఆ దేశ ప్రభుత్వం పేర్కొంది.ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా అసభ్యకరమైన దృశ్యాలను ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. నిబంధనలు పాటించని వెబ్సైట్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.