ఎన్నికలు దగ్గరకొస్తున్న కొలదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటల దాడిని మరింతగా పెంచారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నా నిర్ణయాలలో అతి దారుణమైన నిర్ణయం అయిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని రెండేళ్లు గడుస్తున్నా నేపద్యంలో పవన్కళ్యాణ్ సోషల్ మీడియాలో చంద్రబాబుపై మరియు నారా లోకేష్ పై సంచలన కామెంట్ పెట్టారు.
హటాత్తుగా ఒక్కసారిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు అంటూ తీసుకున్న నిర్ణయం దేశంలో అనేక మంది సామాన్యుల జీవితాలను చిందరవందర చేసిందని పెద్ద నోట్ల రద్దు వల్ల ఏటీఎం దగ్గర పడిగాపులు కాసిన చాలామంది వృద్ధులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారని ఈ పాపంలో టిడిపి వైసిపి పార్టీలు ఉన్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ సందర్భంగా పవన్ సోషల్ మీడియాలో సంపాదించుకున్న డబ్బునే ఎ టి ఎం దగ్గర ఎంతో సేపు నించుని ఇబ్బందులు పెట్టి ఎంతో మంది సాధారణ ప్రజల యొక్క చావుకి కారణమైన ఈ నిర్ణయంకి ఆమోదం తెలిపింది మీ నాన్న గారు కాదా అని పవన్ లోకేష్ ని ప్రశ్నించారు.
అంతే కాకుండా పెద్ద నోట్లు రద్దు చెయ్యాలని చెప్పింది నేనే అని చంద్రబాబు చెప్పుకున్న మాటలు కూడా నిజం కాదా ? అని ప్రశ్నించారు.ఇలాంటి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నపుడు బీజేపీ కి మద్దతు తెలిపింది మీరా మేమా అని ప్రశ్నించారు. ఇంతటి దారుణమైన నిర్ణయానికి వంతు పలికింది అధికారంలో ఉన్న టీడీపీ మరియు ప్రతిపక్షంలో ఉన్న వైసిపి అంటూ తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో మండిపడ్డారు పవన్.