అమెరికా ఉత్తర కాలిఫోర్నియాలో గత గురువారం చెలరేగిన కార్చిచ్చు విలయం విధ్వంసం సృష్టిస్తోంది. మొన్న శుక్రవారం నాటికి తొమ్మిది మంది వ్యక్తులు సజీవ దహన మయ్యారు. 35 మంది కాలిన గాయాలతో బయట పడ్డారు. మరో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నంలో ఆసుపత్రి పాలయ్యారు. ఉత్తర కాలిఫోర్నియా చరిత్రలోనే ఇంతటి విలయం, విధ్వంసం కార్చిచ్చు రూపంలో ముందెన్నడూ లేని విధంగా జరిగిందని అధికారులు చెబుతున్నారు.
కార్చిచ్చు కారణంగా:
*2,50,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
*90వేల ఎకరాల్లోని దట్టమైన అడవి అగ్నికి ఆహుతైంది.
*ఒక్క లాస్-ఏంజెలెస్, వెంచురా కౌంటీ ప్రాంతా లోనే 40 వేల ఎకరాలు అడవి బూడిద కుప్పలుగా మారాయి.
*ఉత్తర కాలిఫోర్నియాలో క్రీ.శ.1800 నుంచి అభివృద్ధి చెందుతూ వచ్చిన చారిత్రాత్మక పారడైజ్ పట్టణం ఒక్క రోజులోనే నామ రూపాలు లేకుండా పోయింది.
*కాలిఫోర్నియా ప్రభుత్వం బుట్టే కౌంటి లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
*మంటలకు గాలితోడు కావడంతో పుల్గా, కోన్-కోవ్ ప్రాంతాలలోని 27,000 మంది ప్రజలను ఉన్న ఫళంగా ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
*6700 గృహాలు అగ్నికి ఆహుతయ్యాయి.
*రెండు లక్షల మందిని ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
*"పెప్పర్ డైన్" విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 7700 మంది నిరాశ్రయులైన విద్యార్థులకు ఆశ్రయమిచ్చారు.
ఇంకా కార్చిచ్చు:
*అంతకంతకూ పెరుగుతోంది.
*అత్యంత వేగంగా నిపుణులు సైతం అంచనా వేయలేనంత వేగంగా కదులుతూ దట్టమైన అడవిని దహించి వేస్తోంది.
*అధికారుల నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇది నిమిషానికి 80 ఫుట్‌బాల్ మైదానాల సైజు పరిమాణంలో అడవిని మింగేస్తోంది.
*గురువారం ఉదయం 6.30 గంటలకు చెలరేగిన కార్చిచ్చు, అంతే అత్యంత వేగంగా విస్తరిస్తోందని, నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయానికి సుమారు 18,000 ఎకరాల్లో అడవి దగ్థమైందని అధికారులు చెపుతున్నారు.
*హెలికాఫ్టర్లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందలాది అగ్నిమాపక యంత్రాలు కార్చిచ్చును అదుపుజేసి నియంత్రించేందుకు అత్యంత తీవ్రంగా శ్రమిస్తున్నారు.