మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో గులాబీ జెండా రాష్ట్రమంతటా రెపరెపలాడినా ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం వెలవెలబోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 సీట్లు ఉంటే టీఆర్‌ఎస్ ఒకే ఒక్క ఖమ్మం స్థానం మాత్రమే గెలుచుకుంది. ఈ జిల్లాలో ప్రజా కూటమి సత్తా చాటింది. కాంగ్రెస్ 6, టీడీపీ 2, ఒక స్థానంలో ఇండిపెండెంట్ విజయం సాధించారు.

Image result for khammam map


అందుకే ఇప్పుడు కేసీఆర్ ఆ జిల్లాను టార్గెట్ చేశారు. వచ్చే పార్లమెంట్, పంచాయతీ ఎన్నికల్లో ఆ జిల్లాలో పార్టీని పటిష్టం చేయాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆ జిల్లాలో గెలిచిన ఒకే ఒక్క ఇండిపెండెంట్ గులాబీ పార్టీలో చేరిపోయారుతెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారుఈ సందర్భంగా వైరా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని రాములు నాయక్ కేటీఆర్ ను కోరారు. వైరాపై ప్రత్యేక శ్రద్ధ, ప్రేమతో అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

Image result for ramulu naik joins trs


ఇదే సమయంలో ఖమ్మం జిల్లాలో గులాబీ జెండా ఎగరాలన్నారు. ఖమ్మం జిల్లాను సవాలు గా తీసుకోవాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు చెప్పారు. భవిష్యత్తులో ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరేస్తామని ధీమాగా చెప్పారు. సీతారామ ప్రాజెక్టు రెండు మూడేళ్ళలో పూర్తవుతుందని.. ఖమ్మం జిల్లా సస్యశ్యామలమవుతుందని కేటీఆర్ అన్నారు.

Image result for ramulu naik joins trs


పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 16 సీట్లు సాధించి కేంద్రాన్ని శాసించాలని కేటీఆర్ అన్నారు. భాజపా, కాంగ్రెస్ దొందూ దొందేనని.. ఆ రెండూ సొంతముగా గెలిచే పరిస్థితిలో లేవన్న కేటీఆర్.. సంఖ్యా బలం ఉన్నదనే.. బయ్యారం ఉక్కు పరిశ్రమ వంటి రాష్ట్ర డిమాండ్లను కేంద్రం పెడ చెవిన పెట్టిందన్నారు. యాచించి తీసుకోవాలా... శాసించి దక్కించుకోవాలా... చైతన్య వంతులయిన ఖమ్మం ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ పిలుపు ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: