ప్రతి ఏడాది మనం మిస్ కాకూడని ఈవెంట్స్, సెలబ్రేషన్స్ ఉంటుంటాయి. ముందుగానే వాటి గురించి తెలుసుకుంటే.. ఏదీ మిస్ కాకుండా ఎంజాయ్ చేయొచ్చు. మరి కొత్త సంవత్సరం 2019లో మనం మిస్ కాకుడని ఈవెంట్స్ ఏంటో తెలుసుకుందామా..
జనవరి
రెండో వారంలో గుజరాత్ లోన
అహ్మదాబాద్‌లో ఇంటర్నేషనల్
కైట్ ఫెస్టివల్ జరుగుతుంది.
ప్రపంచం
నలుమూలల నుంచి చిత్రవిచిత్రమైన
పతంగులను ఇక్కడ ఎగరేస్తారు.
భలే
విచిత్రంగా ఉంటుంది.
ఇక
జనవరి 15
నుంచి
మార్చి 4
వరకూ
ప్రయాగలో అర్థ మహా కుంభమేళా
జరుగుతుంది.
ప్రపంచంలోనే
ఒకే దగ్గర ఇంతమంది జనం పోగుపడటం
ఓ రికార్డు.
192 దేశాల
నుంచి భక్తులు ఈ కుంభమేళాకు
వచ్చే అవకాశం ఉంది.
జూలై 4న ఒడిశాలోని పూరీ జగన్నాధుడి రథయాత్ర జరుగుతుంది. దేవేరులతో రథయాత్రలో పాల్గొన్న జగన్నాథుని చూసి తరించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తారు.
ఆగస్టు
10న
కేరళలో వైభవంగా అలెప్పీ బోట్
రేస్ జరుగుతుంది.
దాదాపు
100
అడుగుల
పొడవుండే పడవలతో వంద మందికిపైగా
తెడ్డు వేస్తుంటే జలంలో
పరుగులు తీసే పడవల సొగసు
చూసేందుకు రెండు కళ్లూ చాలవు.
నవంబర్ మొదటి వారంలో రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ప్రతి ఏటా క్యామెల్ ఫెస్టివల్ జరుగుతుంది. ఒంటెలను అలంకరించి ప్రదర్శనలు నిర్వహిస్తారు. వేల సంఖ్యలో ముస్తాబైన ఒంటెలు కనువిందు చేస్తాయి.