![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/babu-former-cm-415x250.jpg)
ఏపీ సీఎం చంద్రబాబుకు ఇప్పుడు ఓ మాజీ ముఖ్యమంత్రి పంటికింద రాయిలా మారారు. చంద్రబాబుకు చెందిన చరిత్రను తవ్వుతూ ఇబ్బంది పెడుతున్నారు. ఆయన ఎవరో కాదు.. టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన నాదెండ్ల భాస్కరరావు.
ఎన్టీఆర్ టీడీపీ స్థాపించడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి నాదెండ్ల. ఆ తర్వాత ఆయన్ను చరిత్ర వెన్నుపోటు దారుడిగా చిత్రించింది. కానీ తననే అంతా మోసం చేశారంటున్నారాయన. ఇప్పుడు సోషల్ మీడియా విరివిగా అందుబాటులో ఉండటంతో ఆయన వాయిస్ సోషల్ మీడియాలో బలంగా వస్తోంది.
నాదెండ్ల పాత సంగతులన్నీ యూట్యూబ్ ఛానళ్లతో పంచుకోవడంట.. వాటికి లక్షలు,కోట్లలో వ్యూలు రావడం టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. చంద్రబాబు తిరుపతిలో జేబు దొంగతనాలు చేశావడాని.. తిరుపతి పోలీస్ స్టేషన్లలో రికార్డులున్నాయని నాదెండ్ల అంటున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కమ్మ, రెడ్డి అంటూ ముఠాలు కడుతున్నాడని ఆగ్రహించి అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ఆయన చేతిలో ఉన్న స్టిక్‌తో చంద్రబాబుని కొట్టబోయారని నాదెండ్ల భాస్కరరావు చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సోమవారం నాదెండ్ల మీడియాతో మాట్లాడుతూ నాటి ఉదంతాన్ని వివరించారు. చంద్రబాబుని అందరిలో చెన్నారెడ్డి కొట్టబోవడంతో ఏమి జరిగిందో ఎవరికీ అర్థం కాలేదన్నారు. ఆ తర్వాత తాను చెన్నారెడ్డి వద్దకు వెళ్లి ఎందుకు కొట్టబోయారని అడిగితే ‘పార్టీలో ముఠాలు కడుతున్నాడు, చంద్రబాబుని ఎవరూ చేరదీయకండి’ అని చెప్పారన్నారు.