ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న క్రమంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య కులాల చిచ్చు రేగుతోంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజలకు అదిరిపోయే హామీలు ఇస్తూ ప్రచారంలో దూసుకెళ్లి పోతున్నారూ.
ఈ క్రమంలో ఏపీ మంత్రి నారా లోకేష్ కులాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాల ప్రస్తావన తేవడం ద్వారా రాష్ట్రాన్ని అస్థిరపరచడానలి చూస్తున్నారని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు ప్రజల మనోభావాలతో ఆడుకోవడం రాక్షసత్వమని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.
కొండవీడులో రైతు కోటయ్య మృతి ఘటనను కులాలకు ఆపాదించి రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రసంగంలోని కొంతభాగాన్ని ఎడిట్ చేసి ఎస్సీలను అవమానించారని ప్రచారం చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు.
చింతమనేని మాటలకు వారంతా చప్పట్లు, కేరింతలు కొట్టారు... తమను అవమానిస్తుంటే ఎవరైనా చప్పట్లు, కేరింతలు కొడతారా అని ప్రశ్నించారు. ఇదే క్రమంలో నారా లోకేష్ చేసిన కామెంట్లకు సీనియర్ రాజకీయ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఎస్సీలు మధ్య చిచ్చురేపింది తెలుగుదేశం పార్టీ అని ముందునుండి దళితులను తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు లాగానే చూసిందని నారా లోకేష్ చేసిన కామెంట్లకు కౌంటర్లు వేశారు.