కొన్నిసార్లు రెండు
పార్టీల చిహ్నాలు దగ్గర దగ్గరగా ఉండటంతో ఫలితాల్లో తీవ్ర ప్రభావం చూపిన ఉదంతాలు
చాలా ఉన్నాయి. మొన్ననే జరిగిన తెలంగాణా ఎన్నికల్లో టిఆర్ఎస్ పై తీవ్ర ప్రభావాన్ని
చూపాయి. అటువంటి ప్రమాదమే రేపటి ఏపి ఎన్నికల్లో కూగా పునరావృమయ్యే అవకాశం
స్పష్టంగా కనబడుతోంది.
ఇంతకీ విషయం ఏమిటంటే, వైసిపి ఎన్నికల చిహ్నం ఫ్యాన్ గుర్తన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే జగన్ తన పాదయాత్రలో కావచ్చు ఆమధ్య జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో కూడా ఫ్యాన్ గుర్తు చిహ్నాన్ని పదే పదే చూపించారు. సరే ఆ విషయాన్ని అలాగుంచితే కేఏ పాల్ వ్యవస్ధాపక అధ్యక్షుడుగా ఏర్పడిన ప్రజా శాంతి పార్టీ చిహ్నంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలున్నాయని వైసిపి శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
వైసిపి ఎన్నికల చిహ్నం ఫ్యాన్ గుర్తయితే, ప్రజా శాంతి పార్టీ ఎన్నికల చిహ్నం హెలికాప్టటర్. ఈవిఎంలలో ఫ్యాన్ గుర్తు, హెలికాప్టర్ గుర్తు గనుక ఒకదాని తర్వాత మరొకటి వస్తే వైసిపికి దెబ్బ పడే అవకాశాలే ఎక్కువున్నాయి. ఎలాగంటే, ఫ్యాన్ గుర్తులోని రెక్కలు, హెలికాప్టర్ పైన కనబడే ఫ్యాన్ రెక్కలు చూడటానికి ఒకేలాగుంటాయి. గుర్తుల విషయంలో కొందరు పొరపాటు పడే ప్రమాదం లేకపోలేదు.
ఎందుకంటే, తెలంగాణా ఎన్నికల్లో టిఆర్ఎస్ గుర్తయిన కారు చిహ్నానికి దగ్గరగా పోలిఉందే ట్రాక్టర్ గుర్తు చిహ్నముంది. సుమారు 36 నియోజకవర్గాల్లో కారు గుర్తనుకుని ట్రాక్టర్ కు ఓట్లేసిన వారున్నారు. 36 నియోజకవర్గాల్లో ట్రాక్టర్ గుర్తుకు సగటున 10 వేల ఓట్లు పోలయ్యాయి. తక్కువగా 2 వేల ఓట్లు పోలయితే అత్యధికారంగా 25 వేల ఓట్లు పోలయ్యాయి. కాబట్టి ఫ్యాన్ గుర్తు, హెలికాప్టర్ గుర్తు వెంటవెంటనే రాకుండా వైసిపి నేతలు జాగ్రత్తలు పడాలి. లేదంటే దెబ్బ పడిపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.