హైదరాబాద్ లో ఇప్పుడు అన్ని దారులూ  లోటస్ పాండ్ వైపే దారి తీస్తున్నాయి. ఏపీ నుంచి వచ్చి చేరుతున్న నేతలతో జగన్ నివాసం ఫుల్ బిజీగా ఉంటోంది. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త పోట్లూరి వర ప్రసాద్.. అంటే పీవీపీ చేరారు. ఆయనతో పాటు నటుడు రాజారవీంద్ర కూడా చేరారు. 

pvp joins jagan కోసం చిత్ర ఫలితం


టిడిపి సీనియర్ నాయకులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి కూడా ఇవాళ చేరబోతున్నారు. ఇంకా తోట నరసింహులు కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ లో జాయిన్ అవుతున్నారు. ఇంకా.. విజయవాడ మాజీ మేయర్ రత్నబిందు వైసీపీలో చేరబోతున్నారు. 
magunta joins jagan కోసం చిత్ర ఫలితం


ఈ రత్నబిందు ఎవరో తెలుసా... అల్లు అరవింద్ బావమరిది భార్య. అంటే చిరంజీవి కుటుంబ సభ్యురాలు అన్నమాట. ఇంకా  ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ తన భర్త ఎస్‌.ఎం.ఆర్ పెద్ద బాబు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. 

jagan house in hyderabad కోసం చిత్ర ఫలితం


ఈ ఎస్‌ఎంఆర్‌ పెద్దబాబు పేరున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇలా వైసీపీలో చేరబోతున్న నేతలతో హైదరాబాద్‌లోని జగన్ నివాసం ఫుల్ బిజీగా ఉంటోంది. వచ్చీపోయేవారితో ఆ ప్రాంతం చాలా సందడిగా మారింది. ఇప్పుడు హైదరాబాద్‌లో కిటకిటలాడుతున్న ప్రాంతం ఏదైనా ఉంటే అది ఇదే. 



మరింత సమాచారం తెలుసుకోండి: