దాదాపు క్షిపణి దాడి వరకు వెళ్ళి అమెరికా హెచ్చరికతో తగ్గిన భారత్ పాక్ సరి హద్దులలో ఇంకా ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. ఇంకా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగు తున్నాయి. పాక్‌ తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో భారత వాయుసేన యుద్ధ విమానాలు మోహరించింది. పాక్‌తో సరిహద్దు ఉన్న జమ్మూ కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో వైమానిక దళ యుద్ధ విమానాలను మోహరించింది.


ఇవి గత గురువారం రాత్రి విన్యాసాలు చేశాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఏం జరుగుతోందోనని భయాందోళనలకు గురయ్యారు. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారం గా గత ఫిబ్రవరి 26న భారత వాయు సేన పాకిస్తాన్‌లోని బాలాకోట్‌ కేంద్రంగా ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరంపై దాడులు జరిపింది.

Image result for Indo pak missiles face to face

దీనికి ప్రతీకారంగా పాక్ యుద్ధ విమానాలు భారత వైమానిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన ఐఏఎఫ్ పాక్ దాడిని తిప్పికొట్టిన సంగతి తెలిసిందే.

 

అయితే పాకిస్తాన్ నౌకాదళం అదృశ్యమైంది. బాలాకోట్‌ పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్జికల్-స్ట్రైక్స్ తర్వాత పాక్‌ లోని నౌకాదళ స్థావరాలు అన్నీ ఖాళీగా దర్శనమిస్తు న్నాయని ఒక జాతీయ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని వెలువరించింది. దాడి అనంతరం అప్రమత్తమైన పాక్ నౌకాడళం దేశంలోని నౌకాశ్రయాలను వీడి సముద్రంలోకి వెళ్లినట్లు నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి. పాక్ నౌకాదళం లోని నౌకలు ప్రధానంగా కరాచీ, ఒర్మార, గ్వాదర్ నౌకాశ్రయాల్లో ఉంటాయి.


ఫిబ్రవరి 28 వరకు అక్కడ నౌకలు కనిపించాయి. ఈ విషయాన్ని ఉపగ్రహ చిత్రాలు సైతం  ధ్రువీకరించాయి. తొమ్మిది ఫ్రిగేట్లు, 8 జలాంతర్గాములు, 17 గస్తీ నౌకలు ఇతర చిన్నాచితకా నౌకలు అన్నీ నౌకాశ్రయా ల్లోనే ఉన్నాయి. అయితే బాలాకోట్‌ లోని జైషే మొహమ్మద్ ఉగ్రస్థావరంపై భారత్ సర్జికల్ స్టైక్స్ తర్వాత నౌకాశ్రయాల్లోని నౌకలన్నీ ఒక్కొక్కటిగా సముద్రంలోకి వెళ్లిపోయాయి. దీంతో షిప్‌యార్డ్‌ లన్నీ బోసీగా కనిపిస్తున్నాయి.

Image result for operation Trident

భారత్ దాడితో అప్రమత్తమైన పాక్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే నౌకలను సముద్రంలోకి తరలించినట్లు తెలుస్తోంది. 1971 యుద్ధంలో భారత నౌకాదళం “ఆపరేషన్ ట్రైడెంట్” పేరుతో కరాచీ పోర్టును ధ్వంసం చేసింది. ఆ నష్టం నుంచి కోలుకోవడానికి పాకిస్తాన్‌కు కొన్ని దశాబ్ధాలు పట్టింది.

Image result for operation Trident 

మరింత సమాచారం తెలుసుకోండి: