ఆయన రాయలసీమలో ప్రముఖ నాయకుడు. కడప జిల్లా నేత.. ఒకప్పుడు వైఎస్‌తో ఢీ అంటే ఢీ అన్నారు. ఆ తర్వాత జగన్ తోనూ వ్యతిరేకించారు. ఆయనే డీఎల్ రవీంద్రారెడ్డి. ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేయాలనుకున్నప్పుడు రెండే ఆప్షన్స్ ఉన్నాయి.
వైఎస్ పై, జగన్ పై ఉన్న వ్యతిరేకతతో తెలుగుదేశంలోకి వెళ్దామనుకున్నారు. కానీ అక్కడ లోకేశ్ అడ్డుపుల్ల వేశాడని అంటారు. మొత్తానికి ఆయన చివరకు వైసీపీ వైపే మొగ్గు చూపారు. డీఎల్ రవీంద్రారెడ్డి నియోజకవర్గమైన మైదుకూరులో గత ఎన్నికల్లో వైసీపీయే గెలిచింది.
ఈసారి ఆ స్థానం ఎలాగైనా గెలుచుకోవాలని టీడీపీ పట్టుదలతో ఉంది. ఆర్థిక సత్తా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ ను నిలబెట్టింది. అయితే ఇక్కడ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే చాలా స్ట్రాంగ్.. ఇలాంటి సమయంలో రవీంద్రారెడ్డి చివరకు వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.
ఒకప్పుడు వైఎస్.రాజశేఖర్ రెడ్డితోనూ.. ఆ తర్వాత జగన్ తోనూ విబేధించినా.. చివరకు డీఎల్ రవీంద్రారెడ్డి వంటి స్థాయి ఉన్న నేత కూడా వైసీపీలో చేరడం చెప్పుకోవాల్సిన విషయమే. అంటే చివరకు జగన్ ను ఎదిరించిన వాళ్లకు కూడా వైసీపీనే దిక్కయ్యే పరిస్థితి వచ్చిందన్నమాట. ఇది ఏపీ భవిష్యత్ రాజకీయ చిత్రపటానికి ఓ ముందస్తు శకునంలా ఉంది.