కడప జిల్లాలో వైసీపీ అధినేత జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి ని ఇటీవల కొంతమంది దుండగులు హత్య చేసిన విషయం మనకందరికీ తెలిసినదే. అయితే ఎవరు వివేకానంద రెడ్డి ని హత్య చేశారు అన్న విషయం గురించి ప్రభుత్వ విచారణ సంస్థ సిట్ చేస్తున్న విచారణపై తనకు నమ్మకం లేదని..వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత ఢిల్లీలో మీడియా సమావేశంలో పేర్కొనడంతో...ఇదే క్రమంలో ఈ కేసుని కేంద్ర దర్యాప్తు సంస్థ అప్పగించాలని ఆమె కోరనున్న క్రమంలో ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు ఆంధ్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారింది.

Image result for ys vivekananda reddy

ముఖ్యంగా ఈ కేసును అడ్డంపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో పవర్ లో ఉన్న అధికార పార్టీ టిడిపి...తమకు సంబంధించిన వారిని  దోషులుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరపడానికి..ఏర్పాట్లు చేస్తుందని వివేకానంద కుమార్తె సునీత చేసిన కామెంట్లు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారాయి.

Image result for ys vivekananda reddy

కేసును అడ్డంపెట్టుకుని చేతిలో అధికారం ఉంచుకొని తన తండ్రి హత్య కేసును రాజకీయంగా వాడుకోవడానికి ఏపీ అధికార పార్టీ చూస్తుందని..ఈ కేసు విషయంలో కేంద్ర విచారణ సంస్థ జోక్యం చేసుకోవాలని వైయస్ సునీత పేర్కొన్నారు. దీంతో సునీత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: