పవన్ కళ్యాణ్ కూడా అందరిలాంటి రాజకీయ నాయకుడే!  సీజనల్ (సీజండ్ కాదు) రాజకీయ వేత్త – అంటే అవకాశవాదే నని తేలుతుంది – మాట మార్చే తత్వం. ఏ సిద్ధాంతాలు లేని "తాలు" రాజకీయ నాయకుడే కాని ఏ రాజకీయ నీతిని పాటించని గల్లీ రాజకీయ ఙ్జానే! ఆయన్నుంచి పెద్దగా ఆశించేది ఏమీ లేదు.  ఆయన రాజకీయం మొత్తం నామినేషన్ల పర్వం లోనే తేలిపొయింది. ఆయనను అందరూ ముఖ్యమంత్రి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుగారి కాలి చెప్పని అవమానకరంగా అంటున్నారు.  
recent pavan speeches differs from what he said కోసం చిత్ర ఫలితం
కులమతాలకు అతీతంగా రాజకీయాలు చేస్తానని చెప్పే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతాన్ని పొగడటం  ఆయన ఉపన్యాసాల్లో విని పిస్తూ ఉంటుంది.  శ్రీకాకుళం వెళ్ళి అక్కడి ప్రజలని ప్రాంతాన్ని ప్రేమిస్తున్నట్లు చెబుతారు. తెలంగాణలో ఎక్కడైనా ప్రసంగిస్తే తనకు ఈ తెలంగాణా ప్రాంతం ఇస్టమని ఇక్కడి ప్రజలంటే అభిమానమని పలు సందర్భాల్లో చెప్పారు. 


ఇక తెలంగాణా ప్రజల ఇలవేల్పు కొండగట్టు ఆంజనేయుని భక్తుడినని అన్నారు. అయితే, ఆయన ఏమి రాజకీయ ప్రయోజనాలు చేస్తున్నారో? ఏమి ఆశిస్తున్నారో? కానీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఎక్కడబడితే అక్కడ చేసే భజన కార్యక్రమాలు చూస్తుంటే అసలు ఈయనకున్న లేదా అనుసరిస్తున్న సిద్ధాంతాలు ఏమిటో కూడా అర్ధంగాని స్థితి. 
recent pavan speeches differs from what he said కోసం చిత్ర ఫలితం
అయితే ఎన్నికల ముంగిట్లో వివిధ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం ఆయన ఇంతకాలం చేసిన వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి.  అయితే ఆంధ్రా, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఏమాత్రం ఈ ప్రాంతాల మద్య సామరస్యంలో తేడా వచ్చినా అనేక వివాదాలకు దారి తీసి ఎడతెగని సమస్యలకు దారి తీస్తాయని ఇరు ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు. 


ఎటువంటి ఆధారాలు లేకుండా సభ్యత మరచి ఇరు ప్రాంతాల మద్య విలసిల్లుతున్న సామరస్యాన్ని మరచి నోటికొచ్చినట్లు మాట్లాడి అనవసర వివాదాలు తాను తల కెత్తుకుంటూ ప్రజల నెత్తిన రుద్ధటానికి ప్రయత్నం చేస్తున్నారు, 
pavan cheguvera కోసం చిత్ర ఫలితం

ఇటీవల పుల్వామా దాడి తర్వాత దేశమంతా ఒక ఉద్రిక్త పూరిత వాతావరణంలో ఉండగా, ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం, తనకు ఎన్నికల ముందు యుద్ధం వస్తుందనే ఒక సమాచారం ఉందని వ్యాఖ్యలు చేశి తన గౌరవం దేశ వ్యాప్తంగా కోల్పోయారు. అయితే ఆయన వ్యాఖ్యలు శత్రుదేశానికి అనుకూలంగా ఉండటంతో పాక్  మీడియాఅక్కడ హైలెట్ చేసింది. అయితే, ఎవరు చెప్పారో, ఎప్పుడు చెప్పారో చేప్పకుండా జరగాల్సిన నష్టం జరిగి పోయాక తన మాటల అర్థం వేరే అని దిక్కుమాలిన విధంగా తెల్ల ముఖం వేసి ఏదో అతికీ అతకని విధంగా మాట్లాడి కవర్ చేసుకోవటానికి ప్రయత్నించారు. 


వైఎస్ జగన్మోహన రెడ్డితో తనకు రాజకీయ శత్రుత్వం వైరం ఉంటే ఉండొచ్చు ఆయనను ఆయన అనుచరులను విమర్శించొచ్చు. అంతేకానీ ఆయన పుట్టిన రాయల సీమ ప్రాంతాన్ని, పులివెందుల అనే పట్టణాన్ని అగౌరవ పరచటం ఎంతవరకు సమంజసమో ఈ తెలుగు ప్రజల అభిమాననటుడికే తెలియాలి. మంచి చెడు అనేవి గుణాలు అంతే కాని అవి నివసించే ప్రాంటాలకు  చెందవు. ఊరన్నాక మంచి చెడు రెండూ ఉంటాయి. అలాగని చెడుని ప్రాంతాలకు అంటగడితే ఎలా? 
pavan cheguvera కోసం చిత్ర ఫలితం
ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఇదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి స్వంత ఊరు పాలకొల్లులో ఓడినా ఇదే రాయలసీమ ప్రజలు తిరుపతిలో గెలిపించిన విషయం పవన్ కళ్యాణ్ మరిచిపోయారా?  అనే ప్రశ్నలకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పగలరా?  రాష్ట్రానికి నాయకుడుగా ఎదగాలనుకున్న పవన్ కళ్యాణ్ అదే రాష్ట్రంలోని ప్రాంతాలనుద్దేశించి ఇలాంటి అసంధర్భ వ్యాఖ్యలు చేయడం ఆయనలోని అపరిపక్వతను తెలియ చెపుతుంది. 


అయితే, జనాభిప్రాయం వేరుగా ఉంది - ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే  పదే చేస్తున్న విమర్శలు పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలలో ప్రవహిస్తున్నాయి. 
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబును బూచిగా చూపి కేసీఆర్ ఎలా లబ్ధి పొందారు ఇప్పుడు ఏపీలోనూ కేసీఆర్ ను బూచిగా చూపి, ఆయన తో జగన్మోహన రెడ్డి కుమ్మక్కయ్యారని చెప్పి లబ్ధి పొందాలని చంద్రబాబు చేసే ప్రయత్నానికి పవన్ కళ్యాణ్ తాను సమిధ అవనున్నాడు. అది చంద్రబాబు  రాయకీయ వ్యూహం.
pawan kalyan chandrababu naidu కోసం చిత్ర ఫలితం
ఎప్పట్నించో చంద్రబాబు చేస్తున్న ఆరోపణలే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తు చంద్రబాబును మరిపించేస్తున్నారు.  తెలంగాణ వాళ్లకు ఆంధ్రా వాళ్లంటే అలుసు అని, ఆంధ్రా వాళ్లను తెలంగాణ  వాళ్ళు కొడుతున్నారని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయటం రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు వ్యతిరేకంగా సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు పవన్ చేశారు. 


చంద్రబాబు అనేకమార్లు చెసే ప్రకటనలు ఆయన వ్యాఖ్యలలోని పవిత్రతను దిగజార్చగా ఆ అంతరాన్ని పవన్ కళ్యాణ్ పూర్తి చేస్తున్నట్లు కనిపిస్తుంది అందుకే పచ్చ మీడియా పవన్ వ్యాఖ్యలకు ఈ మద్య ప్రాధాన్యత నిస్తూ – టిడిపి కి అనుకూలంగా పవన్ కళ్యాణ్ మాటలను  హైలెట్ చేస్తూ  ‘‘తెలంగాణనా .…పాకిస్తానా!’’ అని వైరాన్ని బహు ముఖంగా  రెచ్చగొట్టాయి.  దాన్నే పోసాని కృష్ణ మురళి బలంగానే ఖండించారు. 
pawan kalyan chandrababu naidu కోసం చిత్ర ఫలితం
తెలంగాణను పాకిస్తాన్ తో పోల్చే స్థాయికి పవన్ దిగజారటం చూసి ఉభయ తెలుగురాష్ట్రాల ప్రజలు అవాక్కైనారు.  పచ్చ మీడియా సంస్థలకు అలా రాయడానికి మనసె లా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అలా తెలంగాణాని పాకిస్తాన్ తో అంతటి పాప కార్యాలు ఇక్కడ ఏం జరుగుతున్నాయనేది పవన్ వివరించలేదు. ఆంధ్రావాళ్ల భూములు కేసీఆర్ ప్రభుత్వం లాక్కుంటున్నదని, పవన్  వ్యాఖ్యానించటం తెలంగాణాలో సంచలనమైంది. ఎవరి భూములు తీసుకున్నారో?  ఎవరిని కొట్టారో? అన్నదానికి ఎలాంటి అధారం చూపించలేదు. 


తన జనసేన పార్టీలోకి వచ్చేవాళ్లను తెలంగాణా అడ్డుకుందని చేసిన ఆరోపణ ఇప్పుడు సర్వతా ప్రశ్నార్ధకమైంది. ఎవరిని అడ్డుకున్నారో? ఎవరు అడ్డుకున్నారో?  చెప్ప లేదు. పైగా పౌరుషం లేదా? ఆంధ్ర పుట్టుక పుట్టలేదా?  అని ద్వేషాన్ని రగిల్చే ప్రయత్నం బాగా చేశారు. ఈ వ్యాఖ్యలను అటు ఆంధ్రా ప్రజలు ఇటు తెలంగాణ ప్రజలు ఏమాత్రం హర్షించడం లేదు. 
pawan KCR friends కోసం చిత్ర ఫలితం
రాష్ట్రవిభజన తర్వాత తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ పాటు అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా సహజీవనం చేస్తున్నారు.  ఇక్కడ ఎవరూ ఎవరి బిక్షతోనో దయాదాక్షిణ్యాలతో బతకడం లేదు. దేశంలో ఎక్కడైనా నివాసం ఏర్పరచుకొని జీవించే హక్కు వారికి రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కు.
ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ నేతలకు రాజకీయంగా మాత్రమే వ్యతిరేకంగా కేసీఆర్ సహా తెలంగాణ ఉద్యమకారులు విమర్శలు చేశారు. దానికి ఆంధ్రప్రదేశ్ నాయ కులు కూడా ప్రతివిమర్శలు చేశారు.

రాష్ట్ర విభజన తర్వాత అటువంటి ఉద్రిక్త వాతావరణం లేనే లేదు. ఈ విషయం పవన్ కళ్యాణ్ కు తెలియకపోతే అజ్ఞాతవాసి చిత్రం విడుదలకు ముందు ప్రగతి భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎందుకు పొగుడుతారు. ఒకవేళ ఆంధ్ర ప్రజలపై దాడులు జరిగి, ఆంధ్రా వారి ఆస్తులు లాక్కుంటే కేసీఆర్ ను ఇన్నాళ్లుగా ఎందుకు నిలదీయ లేదు. కనీసంగా మీడియా ముందు కూడా ఎందుకు మాట్లాడలేదు. 
jd lakshmi narayana joins janasena కోసం చిత్ర ఫలితం
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నట్లుగా ప్రకటించగానే మొట్ట మొదట పవన్ ఎందుకు దానికి మద్దతు తెలిపారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలి తెలంగాణ ఎన్నికల సందర్భంలో కూడా సెటిలర్లు ఉన్న ప్రాంతంలో జనసేన టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిందనేది బహిరంగ రహస్యమే కదా!  పవన్ సోదరుడు నాగబాబు కూడా ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ గెలిచి నందుకు హర్షం ప్రకటించింది వాస్తవమే కదా! ఐదేళ్ల క్రితమో, పదేళ్ల క్రితమో ఉద్యమ సమయంలో తెలంగాణ నాయకులు చేసిన వ్యాఖ్యలను తన రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు రెచ్చగొట్టడం ఎంత వరకు సమంజనం. 


ముఖ్యంగా, కొత్త తరహా రాజకీయాలు చేస్తా అని చెప్పే పవన్ కళ్యాణ్ పట్ల కొంతమందైనా ప్రజలు ఆశగా చూస్తున్నారు. అది మరిచి పోయి ఇలా ప్రాంతాల మధ్య, రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఒక కళాకారుడుగా పవన్ కళ్యాణ్ ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరివాడు. అలాంటి వ్య్క్తి చంద్రబాబు, వైఎస్ జగన్ లాగా పక్కా స్వార్ధ రాజకీయ నాయకుడుగా మారటం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది.  ఒకనాడు ఆయన చెప్పిన ఆదర్శవంత మైన మాతలకు నేడు పవన్ లో ముప్పిరి గొంటున్న స్వార్ధ రాజకీయాలకు పోలికే లేదు.
jd lakshmi narayana joins janasena కోసం చిత్ర ఫలితం
మరో ముఖ్య విషయం వివి లక్ష్మినారాయణ ఎన్నో ఆదర్శాలతో యోగవంతమైన రాజకీయాలు అందిస్తానని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాన్ తో కలసి సాంప్రదాయ స్వార్ధ రాజకీయాల మురుగులో కలసిపోయారు.  పవన్ కళ్యాణ్, సిబీఐ మాజీ జేడి-వివి  లక్ష్మినారాయణ ఇద్దరూ కలసి తెలుగు ప్రజల రెండు చెంపలు వాయించేస్తు న్నారు. తెలుగు ప్రజల దుర్దృష్టం.   

మరింత సమాచారం తెలుసుకోండి: