ఒకానొక సమయంలో కర్నూలులో జరిగిన ఉప ఎన్నికలలో అధికార పార్టీ టీడీపీ అనేక అడ్డదారుల్లో గెలిచి వైసిపి పార్టీని దెబ్బ తీయడం జరిగింది. అయితే ఆ సమయంలో వైసీపీ పార్టీ పని అయిపోయింది ఇంకా అని అందరూ అనుకుంటున్న సమయంలో..జగన్ పార్టీ ప్లీనరీ మహా సభలు పెట్టి త్వరలో పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించి ఆ సమయంలో రాబోతున్న ఎన్నికలలో వైసిపి పార్టీ అధికారంలోకి వస్తే ఇంటింటికి నవరత్నాలు అమలు చేస్తామంటూ హామీలు ప్రకటించి ఆంధ్ర రాజకీయాలలో సంచలనం సృష్టించారు. అదే క్రమంలో ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలుపెట్టి మొత్తం ఆంధ్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశారు జగన్. ఒకసారి జగన్ ప్రకటించిన నవరత్నాలు గమనిస్తే.
వైయస్సార్ రైతు భరోసా: గత ఎన్నికలలో టీడీపీ అధినేత చంద్రబాబు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను అడ్డంగా మోసం చేసి అధికారం సంపాదించారు. అయితే వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు మేలు చేకూరేలా ముఖ్యంగా రెండు ఎకరాలకు మించి ఉన్న రైతుకు అనేక హామీలు ప్రకటిస్తున్నారు జగన్. మొత్తంమీద జగన్ వైయస్సార్ రైతు భరోసా గురించి ఇచ్చిన హామీలను ఒక్కసారి గమనిస్తే...కచ్చితంగా ఏపీ రైతాంగానికి వైయస్ జగన్ వెన్నెముక వంటి హామీలు ఇచ్చారని చాలామంది కామెంట్ చేస్తున్నారు….
వైయస్సార్ ఆసరాతో-డ్వాక్రా సంఘాల పునరుద్ధరణ: 2014 ఎన్నికలలో డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తాం అని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు..ఆ హామీని గాలికొదిలేసి రాష్ట్రంలో ఉన్న మహిళలను అడ్డంగా దారుణంగా మోసం చేశారని వైసీపీ పార్టీ నేతలు అనేకసార్లు సంచలన కామెంట్ చేశారు. అయితే వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాల రుణాలన్నింటినీ నాలుగు దఫాలుగా మార్పులు చేస్తామని ఇటీవల జగన్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇచ్చే విషయంలో కూడా అనేక హామీలు ఇచ్చారు...పింఛన్లు:పింఛన్ల విషయంలో వృద్ధులకు మరియు వికలాంగులకు వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే భారీ మొత్తంలో ప్రస్తుతం అధికార పార్టీ ఇచ్చే దానికంటే ఎక్కువగానే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు జగన్ హామీ ఇచ్చారు.
అలాగే ఇంట్లో ఉన్న పిల్లలను చదువుతూ స్కూలుకు పంపిస్తే ఆ తల్లికి అమ్మ ఒడి పథకాన్న 15 వేల రూపాయలు అందిస్తున్నట్లు..పేర్కొన్నారు. మరియు అదే విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే..రాష్ట్రంలో ఉన్న పేద వాళ్లకు 25 లక్షల ఇళ్లు కటిస్తున్నట్లు హామీ ప్రకటించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచం మీద ఉన్న వారికి..ప్రభుత్వం నుండి డబ్బులు సాయం అందే విధంగా..మరియు ఆసుపత్రికి వెళితే వెయ్యి రూపాయలు దాటితే మిగతా ఖర్చులు మొత్తం అంతా ఆరోగ్యశ్రీలో వచ్చేలాగా ఆరోగ్యశ్రీ పథకం ఉంటుందని సంచలన హామీ ఇచ్చారు జగన్.
మరియు అదే విధంగా గత ఎన్నికలలో బాబు వస్తే జాబు వస్తుందని రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారు అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఇటీవల మండిపడ్డ జగన్..రాబోతున్న రోజుల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రెండు లక్షలకు పైగానే ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు మరియు పరిశ్రమల విషయంలో స్థానికులకు ఉద్యోగం వచ్చేలా 75% నోటిఫికేషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా మద్యనిషేధాన్ని మూడు విధాలుగా నిషేధించి ఆడ పడుచుల కన్నీటిని తుడిచి...కుటుంబాలను నిలబెట్టే విధంగా వైసీపీ ప్రభుత్వం ఉంటుందని జగన్ అన్నారు.
అలాగే చదువుకునే విద్యార్థులకు ప్రస్తుత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా చెల్లించకుండా...వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని..తూట్లు పొడుస్తూ పేద వాడిని చదువుకు దూరంగా చేస్తూ...కార్పొరేట్ పెద్దలకు విద్యా సంస్థలను అప్పజెబుతూ ..విద్యారంగాన్ని బ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు కి బుద్ధి వచ్చేలా రాబోతున్న వైసిపి రాజ్యంలో ప్రతి పేదవాడు ఇంజనీరింగ్ మరియు డాక్టర్ చదువుకునేలా ఫీజులు నేనే చెల్లిస్తాను అంటూ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఉన్నత చదువులు చదివే లా ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ఉంటుందని జగన్ స్పష్టం చేశారు.