సింహాచలం, సింహాద్రి అప్పన్న కొలువుదీరిన ఆలయం.. విశాఖ తీరం సమీపంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వెలసిన ఆలయం. తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. ఉత్తరాంధ్ర వాసులు సింహాద్రి అప్పన్నగా ప్రేమగా పిలుచుకుంటారు. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి.
ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ సింహాచలం.. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయంగా చెబుతారు. ఇలాంటి ఆలయానికి ఇప్పుడు మహర్దశ పట్టబోతోంది. కేంద్రం పురాతన ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ప్రసాద్ పథకం కోసం ఈ ఆలయం కూడా ఎంపికైంది.
ఈ ప్రసాద్ పథకం కోసం కేవలం ఐదు ఆలయాలనే ఎంపిక చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్లోని సింహాచలం ఉండటం నిజంగా ఏపీ వాసులు గర్వపడే విషయం. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ ట్వీట్ ద్వారా ప్రకటించింది.
Hon’ble minister Sh. @prahladspatel approves the selection of historic 11th century hindu temple in simhachalam @simhadri_swamy in vizag under prasad Scheme. Congrats & best wishes to Chairperson @sanagajapati for her dynamism in taking the dvlpmt of the historic temple forward.
— Ministry of Tourism (@tourismgoi) July 29, 2020
ఈ ట్వీట్ ను మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ సంచయిత గజపతి కోట్ చేస్తూ... ఆనందం ప్రకటించారు. అందరం కలసి సింహాచలం దేవాలయాన్ని మరింతగా అభివృద్ధి చేద్దామంటూ పిలుపు ఇచ్చారు.
I am happy 2share the news that @simhadri_swamy has been selected as one of 5 temples from all over india to be a beneficiary of the #PRASAD scheme of the Centre.Together we will develop #Simhachalam as a major piligrimagesite @ysjagan @VSReddy_MP @VelampalliSR @AvanthiSrinivas https://t.co/rkDZwrC9IL
— Sanchaita Gajapati (@sanagajapati) July 29, 2020