నేటి మంచి మాట మానవత్వానికి మించిన మతం లేదు... మానవసేవకు మించిన వ్రతం లేదు.. కానీ ఈ కాలంలో ఇవి రెండు దొరకడం చాల అరుదు. ఎందుకు అంటారా ? ఈ కాలంలో మనుషులలో ఈ లక్షణాలు ఉండటం చాల అరుదు.. ఎందుకంటే.. ఇప్పుడు మనిషి అంటే స్వార్ధ పరుడు అవుతున్నాడు. మనిషికి ఈ కాలంలో స్వార్ధం ఎక్కువ.. అలా అయిపోయింది సమాజం. 

 

మన పెద్దలు చెప్పారు.. మానవత్వానికి మించిన మతం లేదు అని... మానవసేవకు మించిన వ్రతం లేదు అని.. కానీ ఈ కాలంలో మానవత్వంతో ఉన్న వారు తక్కువ.. నిజమే మానవత్వానికి మించిన మతం లేదు.. అయ్యో అనుకునే వారే లేరు.. ఈ కాలంలో వారు అంత కరువైయ్యారు. ఇంకా మానవసేవే అంటారా.. ఆలా చేసే వాళ్ళు నాకు అయితే ఎప్పుడు కనిపించలేదు.. మీకు ఏమైనా కనిపించార?

 

ఈ కాలం మనుషులకు మానవత్వం అంటే ఏంటో కూడా తెలియదు.. మానవత్వం అంటే.. అటు పక్క ఆపదలో ఉన్న వ్యక్తి నీకు ఏమి కాకపోయినా.. అయ్యో పాపం అని వెళ్లి సహాయం చేస్తావు చూడు.. దాన్నే అంటారు మానవత్వం అని. ఇంకా మానవసేవ.. ఈ మానవసేవ గురించి ఏమి చెప్పిన తక్కువే.. తోటి మానవుల ఆపదలు, అవసరాలు తీరే విధంగా చేసే సేవను మానవసేవ అని అంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: