నేటి మంచి మాట.. శ్రమలో ఉన్న ఆనందాన్ని గుర్తించిన వారు జీవితంలో అనుకున్నది సాధిస్తారు. అవును.. మనం అనుకుంటాం .. ఈ పని లేకుండా వస్తే ఎంత బాగుండు అని.. కానీ పని లేకుంటే మనిషికి జీవనం లేదు.. జీవితంలో అనుకున్నది సాధించాలి అంటే మనం శ్రమ పడాలి.. అప్పుడే కదా.. మనకు ఆ శ్రమలో ఉన్న ఆనందం తెలిసేది.
శ్రమ పడకుండా ఏది వచ్చిన శాశ్వతం కాదు అనే విషయాన్నీ మనం తెలుసుకోవాలి.. ఎందుకు అని అడిగేరు.. శ్రమ లేనిదే జీవనం లేదు.. శ్రమ పడితేనే మనకు ఏమైనా ఫలితం ఉంటుంది. శ్రమ పడకుంటే ఫలితం ఉండదు.. శ్రమ లేదు అని మనం అక్కడే ఉన్నాము అంటే ఫలితం కూడా కష్టమే..
ఉదాహరణకు ఇది చుడండి.. ఒక కంపెనీలో మనం ఉద్యోగం చేస్తున్నాం.. ఆ కంపెనీలో ఎక్కువ స్ట్రెస్ లేదు.. అలానే జీతం కూడా టైంకు రాదు.. అదే మనం వేరే కంపెనీలో రాత్రిపగుళ్ళు కష్టపడి పని చేస్తాం.. సమయానికి జీతం అకౌంట్ లో పడుతుంది. అది శ్రమకు ఉన్న విలువ.. అర్థం చేసుకొని శ్రమలో ఉన్న ఆనందాన్ని గుర్తించి మీరు జీవితంలో అనుకున్నది సాధించండి.