నేటి మంచిమాట.. కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి. అని ఎవరు చెప్పారో తెలుసా? అబ్దుల్ కలాం చెప్పారు. అవును. మీరు కొంచం బుద్ధిమంతులు అయితే అబ్బా ఎంత అద్భుతం అంటారు.. అదే మీకు కొంచం పొగరు ఉంది అనుకోండి.. బాగానే చెప్పారు కానీ ఫాలో అవ్వడం కష్టం అంటారు.. అదే జోకులు వేసే స్వభావం అనుకోండి.. అవును.. కలలు కనాలి అంటే నిద్ర పోవాలి అని జోకులు వేస్తారు.. సరే ఈ మంచిమాట అయితే బుద్ధిమంతుల కోసం చెప్తున్నాం..
అవును.. అబ్దుల్ కలాం చెప్పారు ఈ మంచి మాటను.. నిజానికి మనకు ఎంత ఇబ్బంది ఉన్న సరే.. మన ఆర్ధిక పరిస్థితులు మనల్ని మింగేస్తున్న.. మనం కలలు కనడం మాత్రం ఆపకూడదు.. ఎప్పుడు అయితే కలలు కనడం ఆపేస్తారో.. ఆరోజే మనిషికి మరణం వచ్చినట్టు. అందుకే మనుషులకు కలలు లేకుండా ఉండవు..
పుట్టగానే బాగా చదవాలి అని.. చదువుతున్న సమయంలో ఏదో ఒకటి అవ్వాలని.. ప్రజలలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని.. ఆలా తెచ్చుకున్నాక కుటుంబం సంతోషంగా ఉండాలని.. ఏ ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని.. అలానే పిల్లల భవిష్యేత్తు అందంగా ఉండాలని అందరు కలలు కంటారు.. ఆ కలలను సాకారం చేసుకున్న వారి జీవితం అద్భుతంగా ఉంటుంది.. అందుకే కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి. ఏ కలలు లేకపోతే.. నీ జీవితం ఎక్కడ మొదలైందో అక్కడే నిలిచిపోతుంది.