నేటి మంచి మాట.. సమస్యలు లేని జీవితం గాలి లేని ప్రదేశం ఉండదు.. అవును జీవితంలో ఎప్పుడు ఏదొక సమస్య ఉండనే ఉంటుంది. ఎందుకంటే ఇది జీవితం కదా.. ఎప్పటికప్పుడు జీవితంలో కొత్త సమస్యలు వస్తు ఉంటాయి.. ఆలా అని ఆ సమస్యలకు భయపడుతూ వెనుక కూర్చోకూడదు.. దైర్యంగా ఎదిరించాలి.. 

 

చిన్నప్పుడు ఏమో పెన్సిల్ ఎక్కువ షార్ప్ చేస్తే అయిపోతుంది అని భయం.. పెద్ద అయ్యాక ఉద్యోగం రాదు ఏమో అని భయం.. ఉదోయోగం వచ్చాక జీతం సరిపోదు ఏమో అని భయం.. ఈ బయలు.. ఆ సమస్యలు అన్ని తాత్కాలికం.. మనిషి జీవితంలో ఎప్పుడు సమస్యలు ఉంటాయి.. పెద్దవాళ్లకు పెద్ద సమస్యలు.. చిన్న వాళ్లకు చిన్న సమస్యలు.. ఇలా ఎప్పుడు ఏదోక సమస్య ఉండనే ఉంటుంది. 

 

ఇక పోతే అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదిరించాలి అనేది మీకు తెలిసి ఉండాలి.. సమస్యలకు భయపడకూడదు.. దైర్యంగా ఎదిరించాలి.. అప్పుడే నువ్వు అనుకున్న గమ్యానికి చేరుకోగల్గుతావు.. సమస్యలు ఉంటేనే కసితో ఉన్నత శిఖరాలకు చేరుతావు.. సమస్యలు లేని జీవితం.. గాలి లేని ప్రదేశం ఎక్కడ ఉండదు.. గాలి లేని ప్రదేశాన్ని చూపించండి.. సమస్యలు లేని మనిషిని నేను చూపిస్తా. 

మరింత సమాచారం తెలుసుకోండి: