నేటి మంచిమాట.. మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము! అవునా ? కాదా? నేను అయితే అవును అనే చెప్తా. ఎందుకంటే? మన తప్పులు.. మనకు తెలియనివి.. మనకు తెలియదు అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము అవుతుంది. అంతేకదా! మన అజ్ఞానం గురించి మనం తెలుసుకోకుంటే అందరి ముందు చులకన అవుతాం.
అంతేకాదు.. మన అజ్ఞానం గురించి మనం తెలుసుకోకపోతే నిజమైన అజ్ఞానము అదే అవుతుంది. అందుకే మనలో ఏమైనా లోపం ఉంది అంటే వెంటనే తెలుసుకోడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ అంత శక్తివంతమైన.. తెలివైన వారు ఉండరు.. మీరు ఏది చేయలేకపోతున్నారో ? ఎందుకు చేయలేకపోతున్నారా తెలుసుకోండి.
ఆ తప్పులు సరిదిద్దుకుంటే మీరు నిజంగా తెలివైన వారు అవుతారు. మీకు చెప్పేది అర్థం అవుతుంది కదా! మీరు జ్ఞానీ అవ్వాలి అంటే ముందు మీ అజ్ఞానం గురించి తెలుసుకోండి. అందరి మెప్పు పొంది ఆనందంగా జీవించండి.