నేటి మంచిమాట.. మైళ్ళ దూరాన్ని మన మధ్య ఉంచగలవేమో మన మనసుల మధ్య కాదు. అంతేకదా.. నిజమైన ప్రేమకు దూరం ఏంటి? దగ్గర ఏంటి? ప్రేమ అనేది ఉంటే బాధ్యత ఉంటుంది. ఎక్కడ ఉన్న ఏ పని చేసిన మనసులో ఉంటారు.. మనం దూరం ఉండటం కూడా వారికోసమే అయినప్పుడు ఎక్కడ ఉంటే ఏంటి ?
రేపటి మన భవిష్యేత్తు కోసం ఈరోజు కష్టపడటం ఎం పెద్ద కష్టం కాదు అనే చెప్పాలి. మనిషి దగ్గర లేనంత మాత్రాన ప్రేమ లేకుండా ఉండదు కదా! మనిషి లేడు కదా అని వేరే వారిపై ప్రేమ వెళ్తే అది అసలు ప్రేమే కాదు. మనిషి ఉన్న లేకున్నా.. మనసులో తనను తలచుకొని ప్రేమించే వారే గొప్ప ప్రేమికులు.
నిజమైన ప్రేమ ఉంటే.. ఎన్ని మైళ్ళ దూరం ఏర్పడిన పెద్దగా కష్టం అనిపించదు.. ఎందుకంటే మనసులో ప్రేమ ఉన్నప్పుడు.. ఎల్లప్పుడూ వారి గురించే ఆలోచిస్తున్నప్పుడు అది దూరం ఎందుకు అవుతుంది? నిజమైన ప్రేమ ఉండాలి కానీ దేశాలు దాటినా ప్రేమ మారదు.. మారింది అంటే అది అసలు ప్రేమే కాదు!