నేటి మంచిమాట.. నువ్వు చేసిన మంచిపని అందరికి తెలియాల్సిన అవసరం లేదు! అవును.. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే.. పైన ఫోటో చూశారుగా.. ఆకలితో అలమటిస్తున్న కుటుంబానికి ఆకలి తీర్చడానికి కాస్త అన్నం పెడుతారు.. సెల్ఫీ తీసుకుంటారు.. మనుషులంతా అంతే.. అరే కష్టకాలం వచ్చింది.. మనం సాయం చెయ్యాలి.
చేస్తున్నారు సరే.. మరి ఈ వక్రబుద్ధి ఏంటి? నువ్వు సెల్ఫీ తీసి ఫేసుబుక్ లో పెట్టినంత మాత్రాన నువ్వు అందరికి మంచోడివి అయిపోతావా? లేదు.. అసలు కాదు. ఎందుకంటే? నువ్ నిజంగా మంచోడివి అయితే సెల్ఫీ పెట్టాల్సిన అవసరం లేదు.. నువ్వు ఏమి డప్పు కొట్టుకోకపోయిన నీ గురించి తెలుస్తుంది.
ఎందుకంటే నీ స్నేహితులలో ఎవరికైనా కష్టం వస్తే ముందు ఉండేది నువ్వే అని.. అబద్దాన్ని సెల్ఫీ తియ్యడం కాదు.. నిజాన్ని నీ అద్దంలో చూసుకో.. నువ్వు ఏంటో నీకు అర్ధం అవుతుంది. నువ్ సెల్ఫీ పెడితే నువ్వు గొప్ప అని అనుకోరు.. వీడు గొప్ప అని అనిపించుకోడానికి ఈ చిల్లర వేషాలు వేస్తున్నాడు అని అనుకుంటారు... అందుకే అలాంటి సెల్ఫీలు బదులు నువ్వు ఒకరికి కడుపు నిండా భోజనం పెట్టినప్పుడు వారు ''నువ్వు చల్లగుండాలి నాయన'' అని ఆశీర్వదిస్తారు చూడు.. అది చాలు.. మనకు..