మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి.  అనవసరపు ఆరాటం, తాపత్రయం పనికి రావని చెప్పేందుకు ఈ సామెతను ప్రయో గిస్తుంటారు. కొందరికి కొన్నింటిని దక్కించు కోవాలని ఒకటే ఆరాటం. దాన్ని దక్కించు కునేందుకు ఎంతకైనా పాకులాడతారు. దానివల్ల కలిగే ఉపయోగం ఏమిటి?, ప్రయోజనం ఎంత? అనేది ఆలోచించరు. ఎలాగైనా సరే, అనుకున్నది సొంతం చేసుకోవాలనుకునే స్వార్థం ఒక్కటే వీరి విషయంలో పని చేస్తుంది. ఒకవేళ అనుకున్నది దక్కించుకుంటే సరే.. లేదంటే ఓడిపోయినట్టు, దెబ్బతిన్నట్టు భావిస్తారు.  

 

ఈ మాటలు గుర్తు పెట్టుకోండి :

- గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో, వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. 

- నీ అసూయ ఇతరులను కొంత ఇబ్బంది పెట్టవచ్చునేమో కానీ నిన్ను మాత్రం నిలువునా దహిస్తుంది. 

- నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపేస్తే, ఎన్నటికీ విజయం సాధించలేం. 

- అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బతికే వారికి సరైన మిత్రులుండరు. అనుమానంతో బతికే వారికి సరైన జీవితమే ఉండదు. 

- మనిషి తన చేతలతో గొప్పవాడు అవుతాడు. అంతేకానీ జన్మతః కాదు.

- మనిషి వ్యక్తిత్వాన్ని అతని వృత్తితో కాకుండా, ప్రవృత్తిని బట్టి అంచనా వేయాలి. 

- పొరపాటు చేయని ఒక వ్యక్తి ఎప్పుడూ కొత్తగా ఆలోచించలేడు. 

- శక్తి మొత్తం మీలోనే ఉంది. మీరు ఏమైనా చేయగలరు. అన్నింటినీ సాధించగలరు. 

- మనది కాని వస్తువు పై వ్యామోహం పెంచుకోవడం మూర్ఖత్వం. 

- ప్రపంచాన్ని మార్చాలంటే శక్తిమంతమైన ఆయుధం చదువొక్కటే!

- వేలాది వ్యర్థమైన మాటలు వినటం కన్నా, శాంతిని, కాంతిని ప్రసాదించే మంచిమాట ఒక్కటి చాలు!

మరింత సమాచారం తెలుసుకోండి: