నేటి మంచిమాట.. తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువు లేడు! అవును కదా! నిజంగానే నీ మనసు ఎంత బాగుంటే నీ జీవితం అంత బాగుంటుంది.. నీ ఆలోచనలు బాగుంటేనే నీ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది.. అలా కాదు అని ఎవరినో చూసి ఏవో ఆలోచనలు చేసి అలా ఉండాలి అని అనుకుంటే నీ జీవితాన్ని ఎవరు కాపాడలేరు..

 

నీ ఆలోచనలు స్థిరంగా ఉండాలి.. అప్పుడే బాగుంటుంది. నీ జీవితం బాగుండాలి అంటే ప్రశాంత ఏర్పరుచుకోవాలి.. అప్పుడే ఆనందంగా ఉంటావు.. లేదు అంటే నిన్ను ఎవరు కాపాడలేరు. నువ్వు ఆలోచించే విధానం ఏ నిన్ను కాపాడుతుంది.. నువ్వు అందరితో కలిసి మెలసి ఉండాలన్న.. ఒంటరిగా మిగిలిపోవాలన్న నీ ఆలోచనలే ముఖ్యం!

 

నువ్వు ప్రేమించిన మనిషి అందంగా ఉన్న.. అసహ్యంగా ఉన్న తనతో ఉండాలి అని నీ మనసుకు అనిపిస్తేనే నువ్వు ఉంటావు.. లేదు అంటే ఎవరు చెప్పిన ఎంత చెప్పిన ఆ వ్యక్తితో నువ్వు ఉండలేవు.. అందుకే నీ జీవితం ఆనందంగా ఉండాలి అంటే నీ మనసు నిర్ణయిస్తుంది.. నీ మనసే తప్పుడు దారి పట్టింది అంటే నీకు అంతకంటే పెద్ద శత్రువు మరొకరు ఉండరు.. 

 

కొందరు మద్యానికి బానిసవుతారు.. ఇంట్లో కష్టాలు ఉన్న.. భార్య జీతాన్ని కూడా లాక్కెళ్లి తాగుతుంటారు.. ఒకరోజు ఆరోగ్యం పాడవుతుంది.. ఇలాగే తాగితే అతన్నిఎవరు కాపాడలేరు అని చెప్తారు.. అప్పుడు ఆరోగ్యం కోసం అది మానేయాలి అని అతనికి ఉన్న మనసుకు తాగాలి.. తుగాలి అనిపిస్తుంది.. తాగితే ప్రాణం పోతుంది.. అంతకుమించి ఏం అవుతుంది?                                               

మరింత సమాచారం తెలుసుకోండి: