జీవితంలో మనం ఎవరికైనా మంచి చేయకపోయినా పరవాలేదు.. కానీ చెడు మాత్రం చేయవొద్దని పెద్దలు చెబుతుంటారు. పెద్దలు ఏది చెప్పినా అందులో ఎందో అంతరార్థం ఉంటుందన్న విషయం తెలిసిందే.  అందుకే పెద్దల మాట చద్ది అన్నం మూట అంటారు. అలాంటి పెద్దలు చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకుందామా...

 


- పిరికి మాటలు మాట్లాడవద్దు, వినవద్దు. ఎందుకంటే....... అవి జీవిత గమనానికి ఆటంకాలు అవుతాయి. 

-మన లోపల శత్రువు లేనంత వరకు బయటి శత్రువు మనను భయపెట్టలేడు!

-మన శక్తిని తెలియజేసేది .... మన సామర్థ్యం. మనము ఏం చేయగలమో తెలిపేది. ఆత్మవిశ్వాసం. మనమేంటో నిర్ణయించేది........ మన వ్యక్తిత్వం. 

-మనలోని లోపాలను ఎత్తి చూపేవాడే నిజమైన మిత్రుడు. 

-చిరునవ్వును మించిన అందం, వినయాన్ని మించిన ఆభరణం మరొకటి లేదు. 

-వినడానికి కటువుగా ఉన్నా ...... మీ గురించి వాస్తవాలు చెప్పే వారి సలహాలు తీసుకోండి. 

-మన లోపాలను మనం తెలుసుకోవడమే అన్నింటికన్నా పెద్ద చదువు. 

-సమయానికి కొలమానం సంవత్సరాలు గడిచిపోవడం కాదు. కానీ ఆ కాలంలో మనం ఏం చేశాం, ఎలా ఉన్నాం, ఏం సాధించామన్నదే ముఖ్యం. 

-చిన్న విషయమే కదా అని దేనినీ తేలికగా తీసుకోకూడదు. అతి పెద్ద ఓడను కూడా ఓ చిన్న రంధ్రం నిలువునా ముంచేస్తుంది. 

-ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విద్యార్థిగానే ఉండు. అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళుతుంది.
 
-మనల్ని మనం నమ్ముకున్నంత కాలం విజయం మన వెంటే ఉంటుంది, స్వశక్తిని మించిన ఆస్తి మరేది లేదు.  

-ఈర్ష్య, అసూయలు కంట్లో నలుసులాంటివి, వాటిని మనలోంచి తొలగించినపుడే నిర్మలమైన ప్రపంచాన్ని చూడగలం. 

-తన తల్లిని గాఢంగా ప్రేమించే వ్యక్తి జీవితాంతం విజేత మనస్తత్వంతో ఉంటాడు. 

- ఏ పరిస్థితుల్లో ఉన్నా..... నీ కర్తవ్యం నీకు గుర్తుంటే ......... జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: