నేటి మంచి మాట గర్వం మనిషిని ఓటమివైపు నడిపిస్తుంది. అందుకే ప్రతి మనిషి కూడా గర్వంగా ప్రవర్తించకూడదు. ఎంత సంపాదించినా.. ప్రపంచంలో అందరి కంటే నువ్వే కోటీశ్వరుడు అయినా నీ పొట్టకు ఎంత అవసరమో అంతే తింటావు.. అంతకంటే తినలేవు కదా! ఇంకా నీకు మిగితావారికి తేడా ఏముంది? అందరూ ఒకటే.
అలాంటప్పుడు నువ్వు గర్వంగా ప్రవర్తించడం వల్ల ఉపయోగం ఏమిటి? నువ్వు గర్వంగా ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో తెలుసా? అప్పటి వరుకు నీతో ఉన్న మిత్రులు, బంధువులు, కుటుంబసభ్యులు అంత కూడా డబ్బు లేదు అంటూనే నిన్ను అనడం స్టార్ట్ చేస్తారు.. నిన్ను ఘోరాతి ఘోరంగా అవమానిస్తారు. చివరికి నిన్ను వదిలేసి వెళ్తారు.
ఎందుకంటే నువ్వు ఎంత గర్వంగా ఉన్న వాళ్ళు భరించేది కేవలం నీ డబ్బు కోసమే. నీ కోసం కాదు. అందుకే డబ్బుని చూసి గర్వంగా ప్రవర్తిస్తే చివరికి నీకు ఎవరు మిగలరు. అదే అందరూ నీ వాళ్ళు అనుకుని.. ఉన్న సమయంలో అందరికి పెట్టావు అంటే నీ జీవితంలో నువ్వు మోసపోయిన.. నీ దగ్గర ఏమి లేకపోయినా.. అందరూ నీకు తోడు ఉంటారు.. నిన్ను మళ్లీ మంచి స్థాయిలో చూడాలి అనుకుంటారు.
అందుకే గర్వంగా ఉంటె నీకు ఏమి దక్కదు.. అది బంధం అయినా.. విజయం అయినా. అన్ని నాకు వచ్చు.. నాకంటే తోపులు లేరు అని నువ్వు అనుకున్నావు అంటే నీకంటే తోపులు.. నీకంటే గొప్పవాళ్ళు ఉంటారు. ఉండకుండా అయితే ఉండరు కదా. గర్వం లేకుండా గెలవడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటే ఖచ్చితంగా గెలుపు నీ సొంతం అవుతుంది.