
నేటి మంచిమాట.. సంకల్ప బలం ఉన్నవారు ప్రతిదాన్నీ తమకు అనుకూలంగా మలుచుకోగలరు! అవును.. ఏ విషయం అయినా సరే యిట్టె మార్చుకోగలరు. మనం కొన్ని అనుకుంటాం.. కానీ అవి ఉన్నట్టుండి మలుపు తిరుగుతాయి. అలాంటి సమయంలో మనం అనుకున్నట్టుగా అన్ని జరగాలి అంటే కొంచం కష్టమే.. అప్పుడు తెలివిగా దృఢ సంకాల్పంతో మనకు కావాల్సినట్టుగా అనుకూలంగా మార్చుకోవాలి.
ఆది మనకు కాస్త కష్టమైన పని అని తెలిసిన సరే కొంచం కష్టమైన సరే మనకు అనుకూలంగా మార్చుకుంటాం. అంతేకాదు సంకల్పం బలంగా ఉన్నప్పుడు మనకు ఎంత మందిని ఎంత వ్యతిరేకత వచ్చిన యిట్టె మనకు అనుకూలంగా మార్చుకోగలరు. ఉదాహరణకు మీరు ఒక మంచి నగరంలో ఉద్యోగం చెయ్యాలి అనుకుంటారు.. కానీ అందుకు మీ తల్లితండ్రులు అనుమతించారు. అటువంటి సమయంలో ఏం చెయ్యాలి..
ఇంట్లో తల్లితండ్రులకు దైర్యం చెప్పాలి. మనం ఏదైనా సాధించగలం అని వారికి ముందుగా దైర్యం చెప్పాలి. అప్పుడే మనల్ని వారు నమ్మి పక్క నగరాలకు అయినా దేశాలకు అయినా పంపుతారు. అందుకే ముందుగా మనిషికి సంకల్ప బలం ఉండాలి. అప్పుడే ఏమైనా సాధిస్తారు.. ఏదైనా అనుకూలంగా మలుచుకోగలరు.
సంకల్పం గొప్పగా ఉంటే ఎవరైనా ఏమైనా సాధించగలరు. సంకల్పం ఉంటే మార్గం అదే కనిపిస్తుంది. మనకు సంబంధం లేని.. మనకు అనుకులంగా లేని వాటిని కూడా మనకు అనుకూలంగా మార్చుకోగలము. అందుకే అందరూ కూడా ముందుగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం సంకల్పాన్ని బలంగా మార్చుకోవాలి. అప్పుడే మన జీవితంలో మనం ఉన్నత స్థాయికి చేరుతాం.