ఒక చెట్టు నుంచి లక్ష అగ్గిపుల్లలు తయారు చేయవచ్చు .ఒక్క అగ్గిపుల్లతో లక్ష చెట్లను కాల్చి వేయను వచ్చు .అలాగే మనిషికి లక్ష మంచి ఆలోచనలు ఉండవచ్చు కానీ ఒక్క చెడ్డ ఆలోచన లక్ష మంచి ఆలోచనలను కట్టడి చేయవచ్చు. అందుకే అందరం మంచిని పెంచే మంచి పనులకు ఉద్యుక్తులమవుదాం.
- నిజమైన యోగ్యత నదిలాంటిది లోతు హెచ్చే కొలదీ తక్కువ శబ్దంతో గంభీరంగా ప్రవహిస్తుంది ....స్వామి వివేకా నంద
- ప్రపంచంలో మనిషిచేసే ప్రతిచర్యవేనుకా ఆంతర్యం ఉంటుంది .అది అభిమానమైతే దానివెనుక ఇంకా భయంకరమైన స్వార్ధం ఉంటుంది .ఆ స్వార్దానికే ఒక్కొకరు ఒక్కొరకం పేరు పెడతారు .స్నేహమని , ప్రేమని , బాధ్యతని ,బంధమని , వాత్సల్యమని .
- జీవితం సప్తస్వరాల సమ్మేళనం షడ్రుచుల మృష్టాన్న భోజనం ఒక్కోసారి అది పెద్ద చదరంగం నవ్వుతూ ఆస్వాదిస్తే నిత్యనూతనం యవ్వనమైన,వృద్దాప్యమైన
దేవుడాడే వైకుంఠపాళీ మన జీవిత గమనం
- ఎప్పటికి చేరలేను నీ తీరం, ఏనాటికీ తరగదు ఈ దూరం, మరుజన్మకైనా కలిగేనా ఈ ప్రణయం, కడదాక సాగేనా నీకోసం నా పయనం
- అంతు లేని అనంత సాగరం, అనాది గా ఇంతేనా జీవితం.. ఎన్ని ఉన్నా ఏదో కావాలి. ప్రతి బంధం లో ప్రేమ కావాలి, ఏమిటీ స్వార్థం ,ఎందుకీ వెర్రి వ్యామోహం ?
- ఏమిటో ఈ జీవితం.. ఎటు వైపు ఈ పయణం... ఓటమి నీ రాత కాదు..గెలుపు ఇంకొకరి సొత్తు కాదు, నిన్న మరచి నేటినే తలచి శ్రమించు ఆశయం సాధించు!
- ఆశలు అందరికి వున్నా ,వాటిని ఆశయాలు మార్చు కునేది కొందరే ,కలల్ని ప్రేమించాలి ,వాటిని నెరవేర్చుకునే ఆశయాలు కోసమే జీవించాలి ,విజయం కోసం అహర్నిశలు శ్రమించాలి