నేటి మంచి మాట.. దేవుడు వరాలు, శాపాలు ఇవ్వడు. కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తాడు. అవును నిజమే. మనకు ఏం కావాలి అనేది మనకు తెలుసు.. వాటిని సొంతం చేసుకోవాల్సింది మనం. ఎవరో ఏదో ఇస్తారు అని ఏదో తెస్తారు అని ఆశలు పెట్టుకోకూడదు. ఆశలు పెట్టుకుంటే జీవించడం కష్టం. 

 

అలాగే మన జీవితం సరైన దారిలో నడవలేదు అని మనకు శని పట్టింది అని.. దేవుడికి ముక్కున్న ముక్కు తీర్చలేదు అని దేవుడు శాపం పెట్టాడు అని అనుకోవడం మహా పాపం. మనకు దేవుడు ఎటువంటి శాపం ఇవ్వడు.. అలాగే ఏలాంటి వరం ఇవ్వడు. దేవుడు వరలు ఇవ్వడం, శాపాలు పెట్టడం అనేది కేవలం సినిమాలలో మాత్రమే ఉంటుంది. నిజమైన జీవితంలో ఉండదు. 

 

దేవుడు మనకు ఏది ఇవ్వడు.. కేవలం అవకాశం అనేది ఇస్తాడు. అదే రేపు. మనకు ఏ కోరికలు ఉన్న అవి తీర్చుకోవాల్సింది మనమే. మనం దేవుడిని కోరికలు అడిగినంత మాత్రానా మనకు దేవుడు వరాలు ఇచ్చెయ్యాడు. ఇందుకు నిదర్శనమే రొట్టి కథ. ఓ వ్యక్తి దేవుడిని తినడానికి ఓ రొట్టి ఇవ్వమన్నాడు. 

 

అయితే ఆ రొట్టి ఇచ్చినప్పుడు అది కింద పడింది. అది కాస్త దొర్లి.. పల్టీలు కొట్టి ఓ తొర్రలోకి పడిపోయింది. ఇంకా ఆ వ్యక్తి ఏం చేస్తాడు.. దేవుడు నాకు ఇచ్చిన వరం ఇది. ఎలా అయినా సరే తీసుకోవాలి అని వంగాడు కానీ అందలేదు.. మళ్లీ వంగాడు అందలేదు.. ఇంకా చేసేది ఏమి లేక పక్కన ఉన్న కట్టి తీసుకొని పుట్టని పగలగొట్టి ఆ రోటీని తీసుకొని తింటాడు. ఇలా అతనికి నిజానికి దేవుడు వరం ఇచ్చినప్పటికీ కూడా.. అతను ఆ రోటీని తినడానికి అయితే కష్టపడ్డాడు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కడుపు నిండా తిన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: