నేటి మంచిమాట.. సత్యం భగవంతుడికన్నా గొప్పది! ఈ మంచిమాట చెప్పిన మహాత్మ గాంధినే. ఎన్నో అద్భుతమైన మంచిమాటలు చెప్పిన గాంధీ తాతనే ఈ మంచిమాట కూడా చెప్పాడు. అయితే నిజం భగవంతుడి కన్నా గొప్పది. ఎందుకు అంటారా? మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఉన్నది ఉన్నట్టు మన తల్లితండ్రులకు చెప్పేస్తే అప్పుడు వచ్చే ఆనందం వెలకట్టలేనిది. 

 

IHG

 

ఏదైనా కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పినప్పుడు వచ్చే ఆనందం అబద్దం చెప్పిన రాదూ. నిజాన్ని దైర్యంగా ఒప్పుకొని శిక్ష అనుభవించిన మనశాంతిగానే ఉంటుంది. ఈ నిజం చెప్తే మనం చచ్చిపోతాము అని తెలిసిన సరే నిజమే చెప్పాలి. నిజం చెప్పి చస్తే ఎంతో గర్వంగా ఉంటుంది తెలుసా? 

 

IHG

 

మీకు ఒక వస్తువు నచ్చలేదు.. కానీ వాళ్ళు ఫిల్ అవుతారు అని బాగుందని చెప్తారు. అబద్దం. ఈ అబద్దం వల్ల ఆ వస్తువు చూసినప్పుడల్లా ఇది ఎందుకు కొన్నామురా బాబు అని అనిపిస్తుంటుంది. అదే మీరు అప్పుడే ఈ వస్తువు కంటే అది బాగుంది ఒకసారి చుడండి అని చూపించి అదే తీసుకుంటే ఆ వస్తువును జాగ్రత్తగా చూసుకుంటారు. కొన్నందుకు ఉపయోగిస్తారు. 

 

IHG's ...

 

పైన చెప్పినది కేవలం ఒక ఉదాహరణ. ఏ విషయం అయినా.. ఎంత పెద్దది అయినా నిజం చెప్తేనే జీవితం బాగుంటుంది. నిజం చెప్పక వచ్చే ప్రశాంతత మాములుగా ఉండదు. అందుకే అబద్దం చెప్పకుండా నిజం చెప్పి ఆనందంగా జీవించండి.. మీరు జీవితాంతం ఆనందంగా ఉండాలి అంటే ఒక్క ఇదే నిజమే కారణం. 

మరింత సమాచారం తెలుసుకోండి: