నేటి మంచిమాట.. గతం గతః గతాన్ని తలుచుకుంటూ బాధపడకు! అవును.. ఎప్పుడో.. ఏదో తెలియని వయసులో జరిగిన విషయాన్ని తలుచుకొని ఏడిస్తే ప్రస్తుత కాలం మాత్రమే కాకుండా మళ్లీ భవిష్యత్తులో కూడా ఏడవాల్సి ఉంటుంది. గతం అది.. ఇది వర్తమానం.. మనం ఎల్లప్పుడూ సంతోషంగా అందరితో కలిసి జీవించాలి. 

 

IHG


 
ఇప్పటి వరకు నీ జీవితంలో అన్ని బాధాకరమైన ఘటనలే జరిగాయి. భార్య ప్రేమ, వ్యాపారం, పిల్లల ప్రేమ నీ జీవితంలో ఏవీ లేవు.. అన్నీ నష్టపోయావు. సరే.. ఇప్పటి వరకు జరిగింది వదిలెయ్యి. ఇప్పుడు ఆలోచించు.. ఏం చెయ్యాలి అనేది సరిగ్గా ఆలోచించు. ఇప్పుడు అడుగులు వెయ్యి పడ్డావా మళ్లీ లెయ్యి.. మళ్లీ నడువు. ఏదో ఒకరోజు విజయం సాధిస్తావు. 

 

IHG


 
ఒకటి కోల్పోయినందుకు ఎన్ని రోజులు అని ఇంట్లోనే ఉంటావు? ఎన్ని రోజులు వెలుతురు లేని చీకట్లో కన్నీళ్లు కారుస్తూ జీవిస్తావు? నీ భాద ఎవరికి తెలుస్తుంది. నిన్ను ఎవరు పట్టించుకుంటారు ? అలాగే ఉంటే. అందుకే లెయ్యి.. ఇప్పుడు ఉన్న సమయాన్ని ఉపయోగించుకో.. నువ్వు పెట్టిన వ్యాపారం మనసు పెట్టి చేస్ విజయం సాధించు.. 

 

IHG

 

అప్పుడు అందరూ వస్తారు.. నీ చుట్టూ చేరుతారు.. నీకు అవార్డులు ఇస్తారు.. అప్పుడు చెప్పు నీ బాధ గురించి.. అందరూ వింటారు.. ఎందుకంటే విజయం సాధించావు కదా! అందుకే గతాన్ని మర్చిపో.. వర్తమానంలో కష్టపడు.. భవిష్యత్తులో విజయం సాధించి నిన్ను అన్నవారందరికీ నీ విజయాన్ని చూపించు.

మరింత సమాచారం తెలుసుకోండి: