నేటి మంచిమాట.. మానసిక ఆరోగ్యం కావాలంటే యోగ చెయ్యాల్సిందే. ప్రస్తుత ప్రపంచంలో సుమారు 50 కోట్లమందికిపైగా ప్రజలు పలు రకాల మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు. చాలామంది గుర్తించలేరు కానీ ప్రతీ నలుగురిలో ఒకరు జీవిత౦లో ఏదో ఒకసారి ఏదో ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. 

 

IHG

 

మానసిక భాదకు ఏదైనా కారణం అవ్వచ్చు.. కానీ ఆ బాధను బయటకు చెప్పలేక మనసులో పెట్టుకోలేక వైద్యులను కలిస్తే ఎక్కడ పిచ్చివాళ్ళు అని ముద్ర వేస్తారో అని వైద్యుడిని కలవకుండా ఇంట్లోనే నాలుగు గోడల మధ్య సతమతం అవుతుంటారు. అలాంటి వారు ఎవరైనా సరే యోగ చెయ్యడం అలవాటు పడితే మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. 

 

IHG

 

అవును.. ఎంతోమంది వైద్యులు సూచించేది ఇదే. మానసిక ఆరోగ్యం, శరీరానికి దృఢత్వం, ఓర్పును ఇచ్చేది యోగనే. అలాంటి యోగ చేస్తే మనసు శాంతంగా ఉంటుంది. యోగతో వ్యక్తిలో శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక వికాసం సహజంగా పెరుగుతుంది. అందుకే యోగ చెయ్యడం మనిషి జీవితంలో ముఖ్యం. 

 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=YOGA' target='_blank' title='yoga-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>yoga</a> ...

 

ప్రతిరోజు ఒక అరగంట యోగ.. ఒక అరగంట ధ్యానం చేస్తే చాలు మనస్సు ఆనందంగా, ప్రశాంతంగా,సంతోషంగా ఉంటుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, గ్రహణశక్తి కూడా పెరుగుతాయి. మనపై మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సహనం, జాలి, దయ పెరుగుతాయి. మానసిక స్థితి, ప్రవర్తనపై మంచి ప్రభావం చూపించే సెరటోనిన్‌ హార్మోన్‌ పెరుగుతుంది. భయాలు, బద్ధకాలు వదిలిపోయి అందమైన జీవితం మీ సొంతం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: