నేటి మంచిమాట.. మనిషి గొప్ప ఆయుధాలు.. చిరునవ్వు, మౌనమే! అవును.. ఎదుటి వ్యక్తిపై మనకు ఎంత కోపం వచ్చిన సరే కోపాన్ని అణిచి పెట్టుకోవాలి. వాళ్ళు ఎంత రెచ్చగొట్టిన చిన్న చిరునవ్వు నవ్వి మౌనంగా వెళ్ళిపోవాలి. అప్పుడే మన జీవితాన్ని ఆనందంగా జీవించగలము.
ఇంకా అలానే కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనకున్న భాదను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది. అలా ఉండగలగడానికి మనకు కావాల్సిన ఆయుధాలు రెండే.. చిరునవ్వు, మౌనమే.
చిరునవ్వు, మౌనం మనిషికి ఉన్న రెండు గొప్ప ఆయుధాలు. చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు.. మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అందుకే ఎదుటి వ్యక్తి ఎంత పాపాత్ముడు అయినా.. ఎంత రక్షేశుడు అయినా వారిని ఒక మనిషిలా చూసి చిన్న చిరునవ్వు చిందిస్తే చాలు మనకు చిన్న కష్టం వచ్చిన ఆ కష్టాన్ని తీర్చడానికి రాక్షసులు సైతం మన విషయంలో మనిషిగా అలోచించి సాయం అందిస్తారు.
ఇందుకు గొప్ప నిదర్శనం.. ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పాత్ర.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని ప్రకాష్ రాజ్ పాత్ర. రేలంగి మావయ్యను చూశారా? ఆస్తులు లేవు.. సంపాదన లేదు.. కానీ చిన్న చిరునవ్వు.. అందరూ అతనికి బంధువులే. అందుకే జీవితంలో మౌనం, చిరునవ్వు రెండు ఆయుధాలు ముఖ్యమే.