నేటి మంచిమాట.. జీవితంలో ఎవరు శాశ్వతం కాదు! అవును.. మన జీవితంలోకి ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు. ఉన్నంత కాలం మనం వారితో మంచిగా ఉండాలి.. అలాగే వదిలి పోయినప్పుడు అదే తలుచుకొని భాదపడుతూ ఉండకూడదు.. మన జీవితంలో ఏది శాశ్వతం కాదు.. ఎవరు శాశ్వతం కాదు. మన ప్రాణానికే గ్యారెంటీ లేదు.. అలాంటప్పుడు మన జీవితంలో ఉండేవారు చివరి వరకు ఎలా ఉంటారు అనుకుంటాం.
వస్తారు.. సహాయం చేస్తారు.. సహాయం తీసుకుంటారు.. ఉన్నన్ని రోజులు మన కోసమే.. మన వైపే ఉన్నట్టు ఉంటారు. అలా అని జీవితాంతంగా అలాంటి వారికీ కోరుకోవడం న్యాయం కాదు. ఉన్నారని ఎగిసి ఎగసి పడటం.. వెళ్లారు అని కుంగిపోవడం కాదు.. చెప్పాలి అంటే మన ప్రాణానికే గ్యారెంటీ లేదు.. అనుకోకుండా ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే చాలు మన జీవితం ముగుస్తుంది. అలాంటిది మన జీవితాల్లో వచ్చే భాదలు, బాధ్యతలు, బంధాలు ఎంతకాలం ?
ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అని అంటారు.. బతికి ఉంటే ఇంకా పోలేదా అని అంటారు.. రేపు అనేదాన్ని చూస్తామో లేదో తెలియని మన బతుకులకు పగలు, కక్షలు, పంతాలు ఎందుకు అండి.. ఉన్నంత కాలం ఎవరు ఉంది తినేది లేదు.. పోయి సాధించేది లేదు.. ఉన్నంతకాలం అందరితో సంతోషంగా జీవించండి.. ఎన్నో జ్ఞాపకాలను మిగుల్చుకోండి..
మన జీవితంలో ఏది శాశ్వతం కాదు.. వస్తువైనా.. మనిషైనా.. ! మనకు జన్మనిచ్చిన తల్లే మనకు ఒక వయసు వచ్చాక దూరం అవుతుంది.. అలాంటిది మధ్యలో వచ్చిన మనుషులు మనకు జీవితాంతం ఉంటారు అని అనుకోవడం మన తప్పే అవుతుంది. అందుకే మన జీవితం బాగుండాలి అంటే మనం ఎవరు శాశ్వతంగా ఉంటారు అని ఆశించకూడదు.