నేటి మంచిమాట.. డబ్బు అసలైన విలువ ఒకరి వద్ద అప్పు అడిగేటప్పుడే తెలిసొస్తుంది! అవును.. డబ్బు ఉన్న సమయంలో విచ్చల విడిగా ఖర్చుపెట్టి లేని సమయంలో ఎవరినైనా అప్పు అడగాలి అని అనిపించినప్పుడు తెలిసొస్తుంది డబ్బు విలువ. ఎంతో హుందాగా బ్రతికిన మనకు ఒక్కసారిగా ఒకరిని అప్పు అడగాలి అంటే అసలు మనసు రాదు.
అందుకే డబ్బు ఉన్న సమయంలో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మని చూసుకొని ఖర్చు చేసుకోవాలి. ఈరోజు నువ్వు ఒకటి ఖర్చు పెడుతున్నావ్ అని తెలిసిన.. ఈరోజు నువ్వు ఒకరికి సహాయం చేసిన రేపు నీ పరిస్థితి ఏంటి అనేది ముందుగానే తెలుసుకో. లేదు అంటే నిన్ను ఒకరు అప్పు అడిగినప్పుడు వారి పరిస్థితి ఎలానో నీ పరిస్థితి అలానే అవుతుంది.
ఈ కాలంలో ప్రతి ఒక్కరు డబ్బుకే విలువ ఇస్తారు. ఎందుకంటే అందరికి డబ్బుతోనే అవసరం. డబ్బు లేకపోతే మనిషి లేడు. అందరూ అంటారు మంచితనం ఉంటే డబ్బుతో పనే ఉండదు అని.. కానీ కేవలం మంచితనమే ఉంటే మీతో ఎవరికీ పని ఉండదు. డబ్బు కూడా ఉండాలి. మీకు వంద రూపాయిలు వస్తే అందులో 80 రూపాయిలు ఖర్చు పెట్టండి.
20 రూపాయిలు మీకోసము.. మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబ సభ్యుల కోసం ఖర్చు పెట్టండి. మీరు ఎంత మంచివారు అయినా ముందు మీ ఇంటిని సక్రమంగా చేసుకొని పక్కన వారికీ చెయ్యాలి. అలానే డబ్బు ఉన్న సమయంలో అందరికి ఖర్చు పెట్టకుండా.. ఒకరితో అప్పు తీసుకోకుండా ఉండేలా ప్లాన్ చేసుకోండి.