ఈ మధ్య కాలంలో స్వార్థంతో ఆలోచించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చాలామంది స్వార్థం తమకు ఎంతో మేలు చేస్తుందని భావిస్తూ ఉంటారు. కానీ స్వార్థం వల్ల తాత్కాలికంగా ప్రయోజనం చేకూరినా దీర్ఘకాలంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవితంలో ఎల్లప్పుడూ ధర్మం కోసమే పోరాడాలి. ఆ విధంగా శ్రమిస్తే విజయం సొంతమవుతుంది. అలా కాకుండా స్వార్థంతో జీవిస్తే బంధాలు దూరమవుతాయి.

 

అవతలి వ్యక్తులు మనపై నమ్మకం కోల్పోతారు. స్వార్థం కొంతవరకు మంచిదే కానీ ఆ అవలక్షణాన్ని అలవరచుకుంటే మనిషిగా మనం ఎప్పటికీ ఎదగలేం. మన మాటలకు చేతలకు తేడా ఉందంటే మన మనస్సులో స్వార్థం ఉన్నట్టే అర్థం చేసుకోవాలి. ఒక పనిలో విజయం కోసం అడ్డదారులను వెతుక్కొని నిజాయితీగా కష్టపడిన వారికి అవకాశాలను దూరం చేస్తే ఆ సక్సెస్ కు అర్థం ఉండదు.

 

మన స్వార్థం కోసం అవతలి వ్యక్తులను మోసం చేయడం కూడా తప్పే. మనం మోసం చేసామని అవతలి వ్యక్తులకు తెలిసిన రోజున మనం తలదించుకోవాల్సి వస్తుంది. అవతలి వ్యక్తులను నమ్మిస్తూ బ్రతకటంలో కేవలం స్వార్థం మాత్రమే ఉంటుంది. మరికొందరు తమకు సక్సెస్ సాధించే సత్తా లేక విజయం సాధించే వారిపై ఆరోపణలు చేస్తూ విషాదంలో కూరుకుపోతూ ఉంటారు. ఇలాంటి స్వార్థం అత్యంత ప్రమాదకరమైనది.

 

మన స్వార్థంతో ఎదుటిమనిషిని బాధ పెట్టడం, ఎదుటిమనిషికి మనశ్శాంతిని దూరం కూడా మరింత పెద్ద తప్పు. మన మంచిని కోరుకునేవాళ్లను మనం ఎప్పటికీ దూరం చేసుకోకూడదు. చెడును కోరుకునేవాళ్లను ఎప్పటికీ దరి చేరనీయకూడదు. స్వార్థంతో పొగిడే వాళ్లను ఎప్పటికీ నమ్మకూడదు. నిస్వార్థంగా మనం జీవిస్తే విజయాలు దక్కటంతో పాటు సమాజంలో కీర్తిప్రతిష్టలను పొందవచ్చు.                                     

మరింత సమాచారం తెలుసుకోండి: