నేటి మంచిమాట.. చనువు పెరిగితే చులకన తప్పదు! అవును ఎవరికి కూడా ఎక్కువ చనువు ఇవ్వకూడదు. చనువు పెరిగితే చులకన అవుతారు. చులకనవుతే విలువ తగ్గుతుంది. అందుకే.. మీ జీవితంలోకి వచ్చిన కొత్తవారికి అయినా.. పాత వారికైనా చనువు ఎక్కువ ఇవ్వకూడదు.. ఇస్తే మన నెత్తిపైనే తాండవం చేస్తారు.
చనువు పెరిగే కొద్ది చులకన అవుతారు. మనకంటూ ఒక విలువ ఉంది. ఆ విలువను కాపాడొకోవాల్సిన బాధ్యత మనదే. మనం ఎలాగైతే చనువు ఇవ్వకూడదో.. అలానే మరొకరు చనువు ఇచ్చిన మనం తీసుకోకూడదు. వారు ఇచ్చారు అని మనం తీసుకుంటే ఆ బంధం ఎక్కువ రోజులు నిలబడదు.
ఏ బంధంకు అయినా ఒక పరిమితి ఉంటుంది. చనువు పెరిగితే కచ్చితంగా చులకన అవుతారు. వారు ఎంత దగ్గరైన మితిమీరి మాట్లాడకూడదు. మితిమీరి మాట్లాడితే సమస్యలు తప్పవు.. సమస్యలతో పాటు చులకన కూడా అవుతారు. అందుకే చనువు తీసుకోకండి.. ఇవ్వకండి..ఎవరైనా మిమ్మల్ని చూస్తే విలువ ఇచ్చేలా ఉండాలి కానీ చులకనగా మాట్లాడి విలువ తగ్గించేలా ఉండకూడదు. అతి చనువు.. అతి ప్రేమ.. అతి నమ్మకం ఎప్పటికైనా ప్రమాదమే. ఏదైనా అదుపులో ఉంటేనే మంచిది.
మితిమీరిన చనువు బంధాలను తెంచేస్తుంది. ఏదైనా మితిమీరితే అనర్ధం అవుతుంది. అందుకే చులకన కాకుండా మీ విలువను పెంచుకోడానికి ప్రయత్నించండి. అందరితో హుందాగా ప్రవర్తించండి. చిన్నపిల్లలా తత్వాన్ని వదిలేయండి. అప్పుడే జీవితం బాగుంటుంది.