ఉదాహరణకు మీకు ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకోండి.. అప్పుడు మీరేం చేస్తారు..? మహా అయితే ఆ కష్టం ఎలా వచ్చింది..? ఎందుకు వచ్చింది..? అని ఆరా తీస్తాము.. కానీ కొంతమంది మాత్రం కష్టం వచ్చిందంటే చాలు.. ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ వారి చుట్టూనే ఉన్నట్టు భ్రమ పడుతూ ఉంటారు.. అంతేకాకుండా చాలా మంది ఆత్మహత్యాయత్నం కూడా చేస్తారు.. కానీ చచ్చి ఏదీ సాధించలేమని గుర్తించుకోవాలి..
అయితే ప్రతి ఒక్కరికి సమస్యలు రావడం సహజం. అలాంటప్పుడు ఆత్మహత్య చేసుకోవడం, లేదా ఏడ్చేస్తూ కుంగిపోవడం, తీవ్ర మనస్థాపానికి గురి అవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఫలితంగా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అయితే ఏదైనా కష్టం వచ్చినప్పుడు భయపడకుండా, ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి.. అప్పుడే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం మనలో కలుగుతుంది . అంతే కానీ కష్టం వచ్చింది అని ఏడుస్తూ ఉంటే మాత్రం, ఎవరూ వచ్చి ఆ కష్టాన్ని తీర్చారు.. ఏ కష్టమైనా, నష్టమైనా మనమే తీర్చుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఆలోచిస్తూ కూర్చుంటే, చివరికి మిగిలేది శూన్యమే.. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా మీకు కష్టం వస్తే, ఏడవకుండా ఆ కష్టానికి తగ్గ పరిష్కారాన్ని వెతుక్కోవాలి.. అప్పుడే ఎలాంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది..