ప్రస్తుత కాలంలో మనం జీవిస్తున్న ఆధునిక ప్రపంచంలో, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సరికొత్త టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాము..అలాగే ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరి నోట వింటూనే ఉంటాము.. అయితే ఇవన్నీ మనము కూడా తెలుసుకోవాలంటే అన్ని రంగాలపైనా మనకు అవగాహన ఉండాలి. అప్పుడే ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీకు ఒకే వేదిక తారసపడుతుంది. ఆ వేదిక ఏమిటంటే "ఇండియా హెరాల్డ్" . ఇండియా హెరాల్డ్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను మీకు చూపిస్తూ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలనే నెపంతో ఎప్పటికప్పుడు మంచి మాటలను మీ ముందుకు తీసుకొస్తుంది.. అందులో భాగంగానే ఈరోజు మంచి మాట ఏమిటంటే..మాట ఇవ్వొద్దు.. ఇచ్చాక మాయ మాటలు చెప్పొద్దు..!
దీని అర్థం ఏమిటంటే.. ఎవరికీ మాట ఇవ్వకూడదు . అంటే ఆపదలో ఉన్నవారికి ఆ సహాయం చేస్తాను, ఈ సహాయం చేస్తాము అని అంటూ మాట ఇవ్వకూడదు. ఒకవేళ మాట ఇచ్చిన తర్వాత సహాయం చేయవలసి వచ్చినప్పుడు, "నీకు సహాయం చేసే సమయానికి నేను ఇంట్లో లేను.. నాకు కొద్దిగా గడువివ్వండి..చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను.. ఈసారి తప్పకుండా చేస్తాను.." అంటూ ఇలాంటి కల్లబొల్లి మాటలు చెప్పకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తి మీరు చేసే సహాయం పైన ఎంతో ఆధారపడి ఉంటారు. కాబట్టి ఎవరికీ మాట ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా ఆ మాట నిలబెట్టుకోవాలే తప్పా ఇలాంటి కల్లబొల్లి మాటలు చెప్పకూడదు అని దీని అర్థం..
కాబట్టి ఎవరికైనా సహాయం చేయాలని అనిపిస్తే, మీకు నిజంగా చేసే శక్తి ఉంటేనే చేస్తాను అని మాత్రమే చెప్పాలి. అంతేకాకుండా మనం చేసే సహాయం ఎదుటి వాళ్లకు ఎంతో శక్తినిస్తుందని గుర్తుంచుకోవాలి. అంతేకానీ నలుగురిలో మన గొప్పతనం చూపించుకోవడం కోసం ఇతరులకు చేయలేని సహాయాన్ని కూడా చేస్తానని చెప్పి మాట ఇవ్వకూడదు. ఎదుటి వారికి మాట ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించుకుని ఆ తర్వాతనే మాట ఇవ్వాలి. అప్పుడే మీకు మీ మాటకు గౌరవం ఉంటుంది...